A2Z सभी खबर सभी जिले की

కూటమి ప్రభుత్వంతోనే సుపరిపాలన సాధ్యం

టిడిపి మండల అధ్యక్షుడు చలుమూరి వెంకట్రావు

  1. మెంటాడ: న్యూస్): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను కరపత్రాల ద్వారా ఇంటింటికి వెళ్లి పంపిణీ చేస్తూ కూటమి ప్రభుత్వం ద్వారానే సుపరిపాలన సాధ్యమని టిడిపి మండల అధ్యక్షులు చలుమూరి వెంకట్రావు అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు 4.1 కార్యక్రమంలో భాగంగా గిరిజన శాఖ, స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్య రాణి ఆదేశాల మేరకు మండల పార్టీ అధ్యక్షులు వెంకట్రావు ఆధ్వర్యంలో శనివారం బుచ్చిరాజుపేట , పోరాం గ్రామంలో కరపత్రాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి ఈ సంవత్సర కాలంలో ఇచ్చిన హామీలతో పాటు గ్రామ అభివృద్ధి లో ఎంతో కీలక పాత్ర నిర్వహించిందని ప్రతి గ్రామంలోనూ రోడ్లు, డ్రైనేజీ లు, తాగునీటి విద్య వైద్యం తదితర ప్రజా అవసరతలను దృష్టి సారించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు తొలి అడుగు వేసారని తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్, మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం పథకాలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం కూటమి ప్రభుత్వ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని తప్పక నెరవేర్చి తీరుతుందని హామీ ఇచ్చారు. అనంతరం మరొక్కసారి మండలానికి పార్టీ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన చలుమూరి వెంకట్రావుని, జక్కువ పిఎసిఎస్ అధ్యక్షులుగా తొలిసారి ఎన్నికైన ఆర్నపిల్లి సత్యంనీ, సాలూరు ఏఎంసి డైరెక్టర్ గా నియమితులైన రాజుని బుచ్చిరాజుపేట గ్రామ సర్పంచ్ తాడ్డి తిరుపతి దుస్సాలువతోను పూల బొకేతోను సన్మానించారు.ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ ఉపాధ్యక్షులు గెద్ద అన్నవరం, మెంటాడ పీఏసీఎస్ అధ్యక్షులు గొర్లె ముసలి నాయుడు, జక్కువ పిఎసిఎస్ అధ్యక్షులు ఆర్నపిల్లి సత్యం, తాడ్డి తిరుపతి, సిరిపురం గురు నాయుడు, ఎంపీటీసీ రెడ్డి ఎర్నాయుడు, జక్కువ పిఎసిఎస్ డైరెక్టర్ కుంచు వెంకట్ , పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also
Close
Back to top button
error: Content is protected !!