A2Z सभी खबर सभी जिले की

నేరాల నియంత్రణకు నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులపై ప్రత్యేకంగా నిఘా పెట్టాలి

*-విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్*

🌀 *దర్యాప్తులో ఉన్న గంజాయి, మిస్సింగు, ఎస్సీ ఎస్టీ, పోక్సో, ఎన్డీపిఎస్, క్రైం ఎగినిస్ట్ వుమన్, గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులను సమీక్షించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్*

🌀 *రాత్రి గస్తీ సమయాల్లో ఆలయాలు, మసీదులు, చర్చిలు, ప్రభుత్వ కార్యాలయాలపై నిఘా పెట్టాలని అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్*

🌀 *విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలను ప్రదానం చేసిన జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్*

విజయనగరం జిల్లాలో వివిధ పోలీసు స్టేషనుల్లో పని చేస్తున్న పోలీసు అధికారులతో జూలై 9న జిల్లా పోలీసు కార్యాలయంలో మాసాంతర నేర సమీక్షా సమావేశాన్ని జిల్లా ఎస్పీ వకుల్ ఉందల్ నిర్వహించి, దర్యాప్తులో ఉన్న గ్రేవ్,
నాన్ గ్రేవ్, ఎన్.డి.పి.ఎన్., పోక్సో, అట్రాసిటీ, మిస్సింగు, రోడ్డు ప్రమాద కేసులను, లాంగ్ పెండింగు కేసులను సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపీఎస్ మాట్లాడుతూ – ప్రజలకు శక్తి యాప్ గురించి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, ఇందుకు శక్తి టీమ్స్ మరింత విస్తృతంగా పని చేయాలన్నారు. కళాశాలలు, పాఠశాలల్లో
విద్యార్థినులకు సెల్ఫ్ డిఫెన్సు టెక్నిక్స్ నేర్పించేందుకు శక్తి వారియర్స్ టీమ్స్
ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలన్నారు.
అదృశ్యం కేసుల్లో వ్యక్తులను ట్రేస్ చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. పోలీసు స్టేషను పరిధిలో ఆటో డ్రైవర్లు వివరాలు సేకరించి, నేర ప్రవృత్తి కలిగిన ఆటో డ్రైవర్లుపై ప్రత్యేకంగా నిఘా పెట్టాలన్నారు. కళాశాలలు, స్కూల్లో ఈగల్ క్లబ్స్ ను
ఏర్పాటు చేసేందుకు సంబంధిత పోలీసు అధికారులు ఈగల్ బృందాలకు సహకారాన్ని అందించాలన్నారు. మహిళలపై జరిగే అఘాయిత్యాలపై పోలీసు స్టేషనుకు వచ్చే ఫిర్యాదులపై వెంటనే కేసులు నమోదు చేయాలన్నారు. పోలీసు స్టేషనుకు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని, స్టేషనులో ఫిర్యాదుదారులు వేచి ఉండకుండా చూడాలన్నారు.
హిస్టరీ షీట్లు కలిగిన వ్యక్తులపై నిఘా పెట్టాలని, ప్రతీ వారం వారిని స్టేషనుకు పిలిపించి, కౌన్సిలింగు నిర్వహించాలన్నారు. రిపీటెడ్ గా నేరాలకు పాల్పడే నిందితులపై హిస్టరీ షీట్లును ప్రారంభించాలని, వారి కదలికలపై నిఘా పెట్టాలన్నారు. కులాలు, మతాలు, రాజకీయ పార్టీల వివాదాలను ప్రాధమిక స్థాయిలోనే గుర్తించి, సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. నేరాలు జరగకుండా రాత్రి పెట్రోలింగు, గస్తీని
ముమ్మరం చేయాలని, గస్తీకి వెళ్ళే పోలీసు సిబ్బంది తప్పనిసరిగా లారీ, టార్చ్ లైట్లు, విజిల్ ఉండాలని, వాహనాలకు
సైరన్ ఉండే విధంగా చూడాలన్నారు. గస్తీ సమయాల్లో దేవాలయాలు, చర్చిలు, మసీదులు, బ్యాంకులు, ప్రభుత్వ
కార్యాలయలపై నిఘా పెట్టాలన్నారు. జాతీయ రహదారిపై ప్రమాదాలు జరగకుండా హైవే పెట్రోలింగు వాహనాలు
చర్యలు చేపట్టాలన్నారు. జాతీయ రహదారిపై వాహనాలు పార్కింగు చేయకుండా చూడాలన్నారు. 112/శక్తి ఎస్.ఓ.ఎస్.కు వచ్చే కాల్స్ పట్ల స్పందించాలని, సకాలంలో సంఘటనా స్థలంకు చేరుకొని, సమస్యలను పరిష్కరించాలన్నారు.
గంజాయి అక్రమ రవాణ నియంత్రణపై దృష్టి పెట్టాలని, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నాలుగు చెక్ పోస్టులు వద్ద
నిరంతరం వాహన తనిఖీలు చేపట్టే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు.

వివిధ పోలీసు స్టేషన్లులో నమోదై, దర్యాప్తులో ఉన్న ఎస్సీ, ఎస్టీ కేసులు, పోక్సో కేసులు, ఎన్టీపిఎస్, మిస్సింగు, 194 బి.ఎన్.ఎన్. కేసులు, మహిళలపై జరుగుతున్న దాడుల కేసులను, గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులను జిల్లా ఎస్పీ సమీక్షించి, దర్యాప్తు పెండింగులో ఉండుటకు గల కారణాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకొని, దర్యాప్తు పూర్తి చేయుటకు అధికారులకు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ దిశా నిర్ధేశం చేసి, గ్రేవ్ కేసుల్లో 60 రోజుల్లోగా అభియోగ పత్రాలు దాఖలు చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు.

వివిధ రకాలైన పోలీసు విధులను సమర్ధవంతంగా నిర్వహించి, గంజాయి, చోరీలు నియంత్రించుటలోను, లోక్ అదాలత్లో ఎక్కువ కేసులను డిస్పోజ్ చేయుటలోను, దర్యాప్తు కేసులను తగ్గించుటలోను, సిసిటిఎన్ఎస్లో కేసుల వివరాలను సకాలంలో అప్లోడ్ చేయుటలో ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ప్రత్యేకంగా అభినందించి, ప్రశంసా పత్రాలను ప్రదానం చేసారు.

ఈ నేర సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు, బొబ్బిలి జి.భవ్యరెడ్డి, చీపురుపల్లి డిఎస్పీ ఎస్.రాఘవులు, మహిళా పిఎస్ డిఎస్పీ ఆర్.గోవిందరావు, డిటిసి డిఎస్పీ ఎం.వీరకుమార్, న్యాయ సలహాదారులు వై.పరశురాం, పలువురు సిఐలు, వివిధ పోలీసు స్టేషనుల్లో ఎస్ఐలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

*||జిల్లా పోలీసు కార్యాలయం,||*
*||విజయనగరం.||*

Back to top button
error: Content is protected !!