A2Z सभी खबर सभी जिले की

భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) విజయనగరం జిల్లా కమిటీ

ఈరోజు విజయనగరంలో ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బడి బస్సుల కోసం నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా సహాయ కార్యదర్శి కే రాజు, వంశి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కూడా గడుస్తున్న హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తుంది. ఉన్న బస్సులు విద్యార్థులకు ఏమాత్రం సరిపోవడం లేదు ఉన్న బస్సులు కూడా చాలావరకు విద్యార్థులు ఉన్న స్టాప్స్లంట బస్సులు ఆపడం లేదు అలానే ఆ బస్సులు కూడా వాళ్ళ ప్రాంతం నుంచి విజయనగరం పట్టణానికి సకాలంలో చేరుకోవడం లేదు ఇందువల్ల ఎక్కువ మొత్తన్న విద్యార్థులు మొదట క్లాస్ కి విద్యార్థులు అందలేకపోతున్నారు ఇందువల్ల వాళ్లకు హాజరు కూడా పడటం లేదు అలానే సాయంత్రం సమయాన కాలేజ్ పూర్తవ్వకముందే బడి బస్సులు వెళ్లిపోతున్నాయని తెలిపారు. అంతేగాకుండా విద్యకు పెద్దపీట వేస్తామని చెప్పి ఈరోజు విద్యార్థులను విద్యను గాలికి వదిలివేసిన పరిస్థితి, విద్యాలనగరం విజయాల నగరమైన విజయనగరం కి సుదూర ప్రాంతాల నుండి విద్యార్థులు విద్యానాభసించడానికి వస్తున్నారు. విద్యార్థులకు ప్రత్యేకించి బడి బస్సులు వేయాలని ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా కమిటీ గత రెండుసార్లు డిఎం గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కానీ బండి బస్సులపై డిఎం గారు ఎటువంటి చర్యలు తీసుకోలేదు . కాబట్టి ఇప్పటికైనా జిల్లా వ్యాప్తంగా బడి బస్సులు వేయాలి. లేనియెడల ఎస్ఎఫ్ఐ విద్యార్థులు స్థానిక ప్రజానీకం కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని మీడియా ముఖ్యంగా చెప్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా కమిటీ సభ్యులు సూరి బాబు, శివ తదితరులు పాల్గొన్నారు.

Show More
Back to top button
error: Content is protected !!