A2Z सभी खबर सभी जिले की

శ్రీ కోటసత్తెమ్మ తల్లి అమ్మవారి ఆలయ వార్షికోత్సవాలు

పట్టణంలోని రామానాయుడు రోడ్డులో వేంచేసి యున్న శ్రీ కోటసత్తెమ్మ తల్లి అమ్మవారి ఆలయ వార్షికోత్సవాలలో భాగంగా రెండవ రోజైన సోమవారం సాయంత్రం మహిళలచే సామూహిక కుంకుమార్చన లలితా సహస్రనామ పారాయణం కార్యక్రమాలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగాయి. సోమవారం ఉదయం గణేష్ పూజ, అమ్మవారికి పంచామృతాభిషేకము నిర్వహించి అనంతరం లలిత సహస్రనామ పారాయణం, కుంకుమార్చన నిర్వహించారు. వందలాదిమంది మహిళలు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం సత్తెమ్మతల్లికి మహిళలు పసుపు కుంకుమలు సమర్పించుకున్నారు. ఆలయ ధర్మకర్త ఒబ్బిలిశెట్టి వెంకటరమణమూర్తి (రాంజీ), భారతి దంపతులు పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రీ మాట్లాడుతూ

ఉత్సవాల చివరి రోజైన మంగళవారం సాయంత్రం అమ్మవారికి స్థానిక పెద్దచెరువులో తెప్పోత్సవం, ఘటాలు, ఊరేగింపు నిర్వహిస్తామన్నారు. ఉయ్యాల కంబాలతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు. అమ్మవారి ఊరేగింపు కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం జరిగిన పూజా కార్యక్రమాల లో కమిటీ ప్రతినిదులు పేర్ల సీతారామయ్యశెట్టి, కె.వి.ఆర్.కోటేశ్వరరావు, ఒబ్బిలి శెట్టి వెంకట సత్యనారాయణ (ఏడుకొండలు), చెక్కా త్రినాథ్ లతోపాటు పట్టణంలోని పలువురు ఆర్యవైశ్య సంఘ ప్రతినిదులు పాల్గొన్నారు. స్థానిక మంగలివీధి, తుపాకుల వీధి, డాబాతోట, చిన్నవీధి, కర్రల మార్కెట్, పి.డబ్ల్యు మార్కెట్, ఉల్లివీధి తదితర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించు కున్నారు.

Back to top button
error: Content is protected !!