A2Z सभी खबर सभी जिले की

ఆసుపత్రుల్లో పనులు త్వరగా పూర్తి చేయండి: కలెక్టర్‌

 

ఆసుపత్రులలో పెండింగ్‌ ఉన్న సివిల్‌ పనులు, ఎలక్ట్రికల్‌ పనులు వేగంగా పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్‌ అంబేడ్కర్‌ ఆదేశించారు. మంగళవారం కలెక్టర్‌ ఛాంబర్‌లో వైద్యశాఖ, ఇంజనీరింగ్‌ అధికారులతో పనులపై సమీక్షించారు. బాడంగి, బొబ్బిలి, నెల్లిమర్ల, భోగాపురం కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో పనులు పెండింగ్‌ ఉన్నాయని, త్వరగా పనులు పూర్తి చేసి అప్పగించాలన్నారు. పనులు పూర్తవ్వకుంటే చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Related Articles
Show More
Back to top button