
సమయం, కాలం విలువ తెలుసుకోవాలని జిల్లా పౌర సంబంధాల అధికారి డి.రమేశ్ అన్నారు. శుక్రవారం విజయనగరంలో గ్రంథాలయ సంస్థ నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం ముగింపు సభలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు తెలుసుకున్న దేశనాయకుల అనుభవాలను పాటించాలని అన్నారు.
వేసవి శిక్షణా శిబిరంలోనే కాకుండా మిగతా రోజుల్లో కూడా విద్యార్థులు గ్రంథాలయాలకు వెళ్లి పుస్తక పఠనం చేయాలని సూచించారు.