
జూన్ వచ్చిందంటే జేబులు ఖాళీ అవ్వాల్సిందే.
ఈ నెలలోనే స్కూళ్లు, ఖరీఫ్ సీజన్ పొలం పనులు ప్రారంభమవుతాయి. ఓ వైపు పిల్లల ఫీజాలు, యూనిఫాం, బుక్స్, మరో వైపు దుక్కులు, విత్తనాలు, ఎరువులకు డబ్బులు అవసరమవుతాయి. వాతావరణం ఒక్కసారిగా మారడంతో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది. అధిక ఖర్చులతో కూడిన ఈ నెలను నెట్టుకొచ్చేందుకు దాదాపు అన్ని వర్గాల వారు ఇబ్బందులు పడుతుంటారు. మరి ఈ నెల ఖర్చుపై మీరేమంటారు.