A2Z सभी खबर सभी जिले की

విజయనగరంలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

 

విజయనగరంలోని పూల్‌బాగ్‌లో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. చీపురుపల్లి నుంచి దాసన్నపేట రైతుబజార్‌కి కూరగాయల లోడుతో వస్తున్న ఆటోను కారు ఢీకొంది. ప్రమాదంలో ఆటో డ్రైవర్‌ శివ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటోలో ఉన్న రైతులు స్వల్పంగా గాయపడ్డారు. టూటౌన్‌ పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Show More
Back to top button