A2Z सभी खबर सभी जिले की

యోగ , ఆటలపై ఆసక్తి ఎంతైనా అవసరం..యం.పి.డి.ఓ ఏ.బానుమూర్తి

మెంటాడ: మండలంలోని జి.టి.పేట హైస్కూల్ లో బుధవారం ఉచిత శిక్షణా కార్యక్రమంలో యోగ, ఆటలపై ఎంతైనా ఆసక్తి అవసరము అని యం.పి.డి.ఓ ఏ.బానుమూర్తి తెలియజేశారు. ఈ సందర్భంగా భానుమూర్తి మాట్లాడుతూ చదువుతోపాటు యోగ, ఆటల విషయంలో మంచి మెలకువలను తెలుసుకోవాలని తెలియజేశారు. అదేవిధంగా తదుపరి ప్రభుత్వ ఆదేశాల మేరకు యోగా ఆసనాలు నెల రోజులు శిక్షణ పొందడం మంచి అవకాశం ఉంది తెలిపారు. యోగా వల్ల చక్కటి ఆరోగ్యము, శరీర దృఢత్వం కలుగుతుందని తెలిపారు. తదుపరి కుర్చీలాటకు ఎంతో స్పందన రావడం జరిగిందని తెలిపారు. విద్యార్థులు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం జరిగిందని తెలిపారు.
ఈ శిబిరం జూన్ 6వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గ్రంథాలయాలలో చదువు, పోటీ పరీక్షలు, వివిధ విభాగాలకు చెందిన అంశాలకు గల పుస్తకాలు కూడా ఉచితంగా లభిస్తాయి అని అన్నారు.ఈ శిక్షణ కార్యక్రమంలో విద్యార్థులు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో భానుమూర్తి మెంటాడ పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ లోకప్రియ పంచాయతీ కార్యదర్శి ఎల్. ముత్యాల నాయుడు సచివాలయ సిబ్బంది పాఠకులు ఉపాధ్యాయులు ఏఎన్ఎంలు ఆశ వర్కర్లు పాల్గొన్నారు. .

Show More
Back to top button
error: Content is protected !!