A2Z सभी खबर सभी जिले की

మదర్ సెంటిమెంట్ ‘ఫ్రైడే’

దియా రాజ్, ఇనయ సుల్తానా, రిహానా, వికాస్ వశిష్ట, రోహిత్ బొడ్డపాటి హీరో హీరోయిన్స్ నటించిన చిత్రం ‘ఫ్రై డే’. ఈశ్వర్ బాబు ధూళిపూడి దర్శకత్వంలో కేసనకుర్తి శ్రీనివాస్ నిర్మించారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగు తున్నాయి. ఆదివారం మదర్స్ డే సందర్భంగా ఈ చిత్రంలోని అమ్మ పాటను ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత విడుదల చేశారు. అమ్మ ప్రేమను చాటి చెప్పేలా ఎంతో అందంగా పాటను చిత్రీకరించారని టీమ్ను అభినందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంగ్ లాంచ్ ఈవెంట్లో హీరో రోహిత్ మాట్లాడుతూ ‘స్నిగ్ధ పాడిన అమ్మ పాటనన్ను కదిలించింది. ఈ మూవీలో ప్రతి సీన్ ఎంగేజింగ్ ఉంటుంది’ అని చెప్పాడు. ఈ చిత్రంలో తాము మంచి పాత్రలు పోషించామని హీరోయిన్స్ అన్నారు. డై రెక్టర్ ఈశ్వర్ బాబు మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో మదర్ సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది. మదర్స్ డే సందర్భంగా ‘అమ్మ’ పాటను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. మా సినిమాను చూసిన తరువాత ప్రతీ తల్లి తన కొడుకుని ఓ ఛత్రపతి శివాజీలా, మహారాణా ప్రతాప్ సింగ్ పెంచుతారు. పోరాడే శక్తిని అమ్మ మాత్రమే ఇస్తుంది’ అని అన్నారు. ఈశ్వర్ చెప్పిన కథ ఆయనను బాగా కనెక్ట్ చేసిందని నిర్మాత శ్రీనివాస్ అన్నారు. టీమ్ అంతా కార్యక్రమంలో పాల్గొన్నారు.

Show More
Check Also
Close
Back to top button
error: Content is protected !!