A2Z सभी खबर सभी जिले की

వికలాంగ పిల్లలను గుర్తింపుకొరకే సర్వే కార్యక్రమం నిర్వహణ

-ఎంఈఓ యు.వి.యస్ శివాజీ వర్మ

మెంటాడ: వికలాంగ పిల్లలను గుర్తింపు కొరకే సర్వే కార్యక్రమమును నిర్వహించడం జరుగుతోందని ఎంఈఓ యు.వి.యస్ శివాజీ వర్మ తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ నిర్వహిస్తున్న ప్రత్యేక అవసరాలు గల పిల్లలను గుర్తించి, వాళ్లను పాఠశాలలో చేర్పించాలి అని ఈ సర్వే ద్వారా తల్లిదండ్రులకు సమాచారాన్ని అందిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే మెంటాడ మండలం లోని గుర్ల గ్రామంలో సర్వే లో బాగం గా శివాజీ వర్మ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో దివ్యాంగ విద్యార్థులకు వారి సామర్థ్యాలకు అనుగుణంగా బోధన అలాగే వారికి పాఠశాలలో ఎటువంటి ఆటంకాలు కలవకుండా రైలింగ్ ర్యాంపు ఫ్రెండ్లీ టాయిలెట్ వంటి సౌకర్యాలుఉన్నాయన్నారు. నీ ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ప్రభుత్వం వివిధ ఉపకరణాలను ఉపకార వేతనాలను తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఆయన కోరారు. ఈ సర్వేలో ప్రత్యేక ఉపాధ్యాయులు చందర్రావు పద్మజ మాట్లాడుతూ వచ్చేనెల 9వ తేదీ వరకు మండలంలో ఈ బడి ఈడు బడి బయిట గల దివ్యాన్ని పిల్లలు గుర్తించి కార్యక్రమం జరుగుతుందని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో భవిత పాఠశాల ఉపద్యాయులు చందర్రావు పద్మజతల్లిదండ్రులు పాల్గొన్నారు.

Show More
Check Also
Close
Back to top button