A2Z सभी खबर सभी जिले की

పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి చర్యలు

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్.

విజయనగరం జిల్లా పోలీసుశాఖలో వివిధ హెూదాల్లో పని చేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది సమస్యల
పరిష్కారానికి జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎన్ మే 16న జిల్లా పోలీసు కార్యాలయంలో “పోలీసు వెల్ఫేర్ డే”
నిర్వహించి, సిబ్బంది నుండి విజ్ఞాపనలు స్వీకరించి, పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపిఎస్ గారు మాట్లాడుతూ – పోలీసు సిబ్బంది సమస్యల
పరిష్కారానికి కృషి చేస్తానని, పోలీసు సంక్షేమానికి ప్రాధాన్యత కల్పిస్తానన్నారు. “పోలీసు వెల్ఫేర్ డే” నిర్వహించుటలో
భాగంగా పోలీసు సిబ్బంది ఒక్కొక్కరిని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ జిల్లా పోలీసు కార్యాలయంలోని తన చాంబరులోకి
పిలిచి, వారి వ్యక్తిగత, వృత్తిపరమైన, శాఖాపరమైన సమస్యలను తెలుసుకొని, వారి నుండి విజ్ఞాపనలు స్వీకరించారు.
సిబ్బంది విజ్ఞాపనలు పరిశీలించిన జిల్లా ఎస్పీ, వాటి పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు. పోలీసు సిబ్బంది
తెలిపిన వ్యక్తిగత, శాఖాపరమైన సమస్యలను జిల్లా ఎస్పీ స్వయంగా పుస్తకంలో నోట్ చేసుకొని, వాటి పూర్వాపరాలు
పరిశీలించి, పరిష్కరించేందుకు త్వరితగతిన చర్యలు చేపడతానని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.

Show More
Back to top button
error: Content is protected !!