A2Z सभी खबर सभी जिले की

ఆర్టీసీలో ముగిసిన 21 వ బ్యాచ్ హెవీ డ్రైవింగ్ శిక్షణ

నేడు స్థానిక విజయనగరం ఆర్టిసి గ్యారేజ్ వద్ద
ఏపీఎస్‌ ఆర్టీసీ విజయనగరం డ్రైవింగ్‌ స్కూల్‌ ఆధ్వర్యంలో హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ శిక్షణ కళాశాలలో 21 వ బ్యాచ్ అభ్యర్థులకు హెవీ డ్రైవింగ్ శిక్షణ బుధవారం తో ముగిసింది.
జిల్లా ప్రజా రవాణా అధికారి సి.హెచ్. అప్పలనారాయణ శిక్షణ పూర్తి చేసుకున్న
అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. భవిష్యత్తులో మంచి డ్రైవర్స్ గా గుర్తింపు తెచ్చుకోవాలని సూచించారు.డ్రైవర్లకు డ్రైవింగ్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేసినారు డిపో మేనేజర్ జె.శ్రీనివాసరావు మాట్లాడుతూ మరో వారం రోజుల్లో 22 వ నూతన బ్యాచ్ ప్రారంభవుతుందని తెలిపారు. లైట్ వెహికల్ లైసెన్స్ ఒక సంవత్సరం అనుభవం కలిగి 21 సంవత్సరాలు నిండినవారు అర్హులని తెలిపారు. మొత్తం శిక్షణ 40 రోజుల పాటు వుంటుందని ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు డ్రైవింగ్ స్కూల్ ఇన్స్పెక్టర్ డీఎన్ రాజు 7382924030, 98666 49336 నెంబర్లు సంప్రదించాలని కోరారు.

Show More
Check Also
Close
Back to top button
error: Content is protected !!