
విజయనగరం నుండి విశాఖపట్నం, బొబ్బిలి,పార్వతీపురం,శ్రీకాకుళం ప్రతిరోజు ప్రయాణించే ఎం. ఎస్. టీలు (కార్మికులు, విద్యార్థులు మరియు క్రింది స్థాయి మరియు మొదలగు ఉద్యోగులు) తమ వాహనాలు (బైక్లు/సైకిళ్లు) విజయనగరం రైల్వే స్టేషను ప్రాంగణంలోని పార్కింగ్ స్టాండ్ లో 2022 సంవత్సరం నుండి ఇప్పటివరకు బైక్/సైకిల్ కు పార్క్ చేసినందుకు రోజుకు రూ.02 నుండి రూ.05 మరియు నెలకు రూ.180/- చొప్పున చెల్లిస్తున్నాము.
ఇటీవల, పార్కింగ్ స్టాండ్ యజమాన్యం తేదీ 14-07-2025 నుండి బైక్ / సైకిల్కు రోజుకు రూ. 40/- నుండి 50/- మరియు నెలకు రూ. 900/- కు పించి, ఈ విషయాన్ని నోటీసు బోర్డు ద్వారా తెలియజేస్తూ పార్కింగ్ స్టాండ్ నందు పెట్టడం జరిగింది. ఒకేసారి 400% (శాతం) ఛార్జీల పెంపు చాలా అసహనీయమైనది మరియు అన్యాయమైనది. ఎం. ఎస్. టీ లో చాలా వరకు రోజు వారి వేతనం కి వెళ్ళేవారు, విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎక్కువగా ఉండటం వలన ఈ యొక్క పెంపుదల ఎం.ఎస్.టీలపై గణనీయమైన ఆర్థిక భారం అవుతుంది.
అందువల్ల, గౌరవనీయమైన DRM వారు, పార్కింగ్ ఛార్జీలను తగ్గించాలని మా వినతిని పరిగణించి, వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని విజయనగరం ఎం.ఎస్.టీలు వారందరం కోరుతున్నాము.