
మండలం కోమటిపల్లి – దొంకినవలస రైల్వే స్టేషన్ల మధ్య ఓ వ్యక్తి మృతిచెందినట్లు GRP హెడ్ కానిస్టేబుల్ ఈశ్వరరావు ఆదివారం తెలిపారు. పాచిపెంట గ్రామానికి చెందిన దాసరి తవిటయ్య మరడాం సమీపంలో రైలు పట్టాలు దాటుతుండగా గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తవిటయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేశామన్నారు.