A2Z सभी खबर सभी जिले की

సిద్దూ సైకిల్ భళా..! మూడు గంటల చార్జింగ్ 80 కిలోమీటర్ల ప్రయాణం జె.కొత్తవలస గ్రామ ఇంటర్ విద్యార్థి బ్యాటరీ సైకిల్ ఆవిష్కర

మండలంలోని పూనువలస పంచాయతీ పరిధిలోని జె. కొత్తవలస గ్రామానికి చెందిన రాజపు సిద్ధూ రాజాంలోని ఓ ప్రైవేటు కళాశా లలో ఎంపీసీ గ్రూపులో ఇంటర్ సెకెండియర్ చదువుతున్నాడు. ప్రతిరోజూ ఇంటి నుంచి రాజాంలో తను చదువుతున్న కళాశాలకు వెళ్లేం దుకు 17 కిలోమీటర్ల దూరం. మూడు కిలో మీటర్లు కాలినడకన వెళ్లి, అక్కడ నుంచి బస్సు, లేదంటే ఆటో ఎక్కివెళ్లాలి. బస్సు రావడం ఆలస్య మైతే కళాశాలకు సమయానికి చేరుకోలేని పరి స్థితి. రానుపోను చార్జీలకు రోజుకు రూ.60లు ఖర్చయ్యేది. ఈ సమస్యలను అధిగమించాలని సిద్దూ తలచాడు. రూ.30వేలు ఖర్చుచేసి ఆన్లై న్లో రాజస్థాన్, ఢిల్లీ నుంచి సామగ్రిని తెప్పించు కున్నాడు. పాఠశాల దశలో విజ్ఞాన ప్రదర్శనల్లో ప్రదర్శంచేందుకు రూపొందించిన ప్రాజెక్టుల

ఆ విజ్ఞానంతోనే..

ఇంటి నుంచి తరగతులకు సమయానికి వెళ్లేలే కపోవడంతో చాలా ఇబ్బందికరంగా ఫీలయ్యేవాడిని. తన సమస్యకు పరిష్కారం కోసం నిరంతరం ఆలోచించేవాడిని. హైసూల్లో చదువుకొనే రోజుల్లో పాల్గొనే సైన్స్ విజ్ఞాన ప్రదర్శనల అనుభవంతో ఎలక్ట్రి కల్ చార్జింగ్ సైకిల్ తయారు చేసేందుకు పూనుకున్నాను. దీనిని తయారు చేయడానికి అవసరమైన పరికరాలు రాజస్థాన్, ఢిల్లీ నుం చి ఆన్లైన్ లో తెప్పించుకున్నాను. వీటిని స్నేహితుని సహాయంతో రెండు రోజుల్లో సైకి లు బిగించాను. ప్రస్తుతం ప్రతిరోజూ కళా శాలకు ఎలక్ట్రికల్ చార్జింగ్ సైకిల్పైనే వెళ్తు న్నాను. నా సమస్య పరిష్కారం కావడం ఆనందంగా ఉంది.

Related Articles

– సిద్దూ, జె.కొత్తవలస

అనుభవాన్ని రంగరించి మరో స్నేహితుడితో కలిసి బ్యాటరీతో నడిచే సైకిల్ను తీర్చిదిద్దాడు. కేవలం 3 గంటల విద్యుత్ చార్జింగ్తో 80 కిలోమీ టర్ల దూరం ప్రయాణించేందుకు వీలుగా మలి చాడు. కేవలం రూ.6 ఖర్చుతో కళాశాలకు వెళ్లి

తను రూపొందించిన ఎలక్ట్రికల్ చార్జింగ్ సైకిల్తో సిద్దూ

తిరిగొస్తున్నాడు. కుమారుడి ప్రతిభను చూసి కూలీలైన తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. విద్యార్థి సృజనాత్మక ఆలోచనతో ముందుకు సాగుతున్న విద్యార్థిని గ్రామస్తులతో పాటు కళా శాల అధ్యాపకులు అభినందిస్తున్నారు.

Show More
Back to top button
error: Content is protected !!