

ఇటీవల సవరించిన జీఎస్టి రేట్లతో పాలు, పాల ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయని పలు డెయిరీ యాజమాన్యాలు ప్రకటించాయి. విశాఖ డెయిరీలో మొత్తం 188 ఉత్పత్తుల్లో 94 ఉత్పత్తుల గరిష్ట పాల ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయని తెలిపింది. పాలు లీటరుకు రూ.2 నుంచి రూ.3 వరకు తగ్గనుందని వెల్లడించింది. పనీర్ కేజీ ప్యాకెట్ ధర రూ.20, నెయ్యి కేజీకి రూ.42 వరకు తగ్గుతాయని చెప్పింది. మరి క్షేత్రస్థాయిలో రేట్లు తగ్గాయా కామెంట్ చెయ్యండి.