A2Z सभी खबर सभी जिले की

నేరాల నియంత్రణలో సాంకేతికతను విరివిగా వినియోగించాలి

విశాఖపట్నం రేంజ్ డిఐజీ గోపినాథ్ జట్టి, ఐపిఎస్

వార్షిక తనిఖీల్లో భాగంగా విశాఖపట్నం రేంజ్ డీఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి, ఐపిఎస్ గారు ఆగష్టు 23న విజయనగరం 2వ పట్టణ పోలీసు స్టేషను సందర్శించారు. విజయనగరం డిఎస్పి ఎం. శ్రీనివాస రావు గారు మరియు ఇతర పోలీసు అధికారులు రేంజ్ డీఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి, ఐపిఎస్ గారికి స్వాగతం పలికి, పుష్పగుచ్ఛం అందించగా, డీఐజీ గారు పోలీసు సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు.
అనంతరం, స్టేషను ప్రాంగణంను పరిశీలించి, పోలీసు స్టేషన్ లోని సి.సి.టి.వి. కమాండ్ కంట్రోల్ రూమును సందర్శించి సి.సి.టి.విల పనితీరును పరిశీలించి 2వ పట్టణ పోలీసు స్టేషను సిఐకి సూచనలు చేసారు. పోలీసు స్టేషన్లో పని చేస్తున్న కోర్ట్ కానిస్టేబుల్స్తో మాట్లాడి కోర్టులో శిక్షలు పడటానికి అనుసరించాల్సిన పద్దతుల గురించి వివరించారు. సాక్షులను సకాలంలో కోర్టులో హాజరుపర్చాలని, సమన్స్ను సకాలంలో సర్వ్ చేయాలని, సాక్షులు వారి సాక్ష్యంను కోర్టులో చెప్పే విధంగా బ్రీఫింగ్ చెయ్యాలన్నారు. అనంతరం, పోలీసు స్టేషన్ లోని రిసెప్షన్, గదులను పరిశీలించి, రికార్డులు, సీడీ ఫైల్స్ తనిఖీ చేసి, పోలీసు స్టేషన్ పరిధిలో శాంతిభద్రతలపై సమీక్షించారు. నేరాలు నియంత్రనలో సాంకేతికతను విస్తృతంగా వినియోగించి నేరాలను అదుపు చేయాలన్నారు. సైబర్ నేరాలను నియంత్రించుటకు అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని, సైబర్ నేరాలు దర్యాప్తులో సాంకేతికతను వినియోగించుకోవాలని, బాధితులకు న్యాయం చెయ్యాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో త్వరలో అన్ని పోలీసు స్టేషన్లకు డ్రోన్స్ను సరఫరా చేస్తామన్నారు. అనంతరం మహిళా సంరక్షణ పోలీసులతో డిఐజి మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మహిళా సంరక్షణ పోలీసుల పాత్ర సమాజంలో చాలా కీలకం అని, వారు శక్తి యాప్ గురించి క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలని, ఆపద సమయాల్లో శక్తి యాప్ ఉపయోగించి, పోలీసుల సహాయం ఏవిధంగా రక్షణ పొందాలో ప్రజలకు ముఖ్యంగా మహిళలు, విద్యార్థినులకు వివరించాలన్నారు. మహిళలు, విద్యార్థినుల రక్షణను దృష్టిలో పెట్టుకొని వారికి రక్షణగా నిలిచే చట్టాల పట్ల అవగాహన కల్పించాలని, అదేవిధంగా అసాంఘిక కార్యక్రమాలు మరియు గంజాయి గురించి సమాచారంను సేకరించి సంబంధిత అధికారులకు చేరవేయాలని ఎం.ఎన్.పి.లను డిఐజి ఆదేశించారు. మహిళలు, చిన్నారులపై ఎటువంటి అఘాయిత్యాలు జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను డిఐజి గోపీనాథ్ జట్టి ఆదేశించారు.
క్షేత్ర స్థాయిలో శాంతిభద్రతల సమస్యలు వచ్చే అంశాలను ప్రాథమిక స్థాయిలో గుర్తించి, వాటి నియంత్రణకు చర్యలు చేపట్టాలన్నారు. మసీదులు, చర్చిలు, దేవాలయాలు, దేవతా మూర్తులు, ప్రముఖుల విగ్రహాల భద్రతకు చర్యలు చేపట్టాలని, నిఘా పెట్టాలని, మరిన్ని సీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, వాటి పరిరక్షణకు స్థానికులతో రక్షణ కమిటీ లను ఏర్పాటు చేయాలని అధికారులను డీఐజీ ఆదేశించారు. పోలీసు స్టేషన్ సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలు గురించి, వారు చేసే పనులను, ఎప్పటి నుండి పనిచేస్తున్నది గోపీనాథ్ జట్టి, ఐపిఎస్ గారు అడిగి తెలుసు కున్నారు. అనంతరం విశాఖపట్నం రేంజ్ డిఐజీ గోపినాథ్ జట్టి మరియు జిల్లా ఎస్పి వకుల్ జిందల్ పోలీసు స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు.
ఈ వార్షిక తనిఖీల్లో విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి, ఐపిఎస్ వెంట జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు, ఎస్బి సిఐ ఎ.వి.లీలారావు, 2వ పట్టాణ సిఐ టి. శ్రీనివాసరావు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Back to top button
error: Content is protected !!