
ఈరోజు విజయనగరం పట్టణంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ప్లీనరీ సమావేశాలు మొదలయ్యాయి. మొదటగా ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా అధ్యక్షులు డి రాము గారు ఎస్ఎఫ్ఐ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రారంభ ఉపన్యాసంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు పి రామ్మోహన్ గారు మాట్లాడుతూ విజయనగరం జిల్లా ఉద్యమాల ఖిల్లా, ఈరోజు భారత ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చి అన్ని రాష్ట్రాల మీద అమలు చేయాలని రుద్దుతుంది. గత రాష్ట్ర ప్రభుత్వం హయాంలో అత్యుత్సాహంగా నూతన విద్యా విధానాన్ని అమలు చేశారు. దీనివలన అనేక మంది విద్యార్థులు విద్యకు దూరమైనారు వేల కోలది పాఠశాలలు మూతపడినాయి. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఆరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నూతన విద్యా విదానాన్ని రద్దు చేస్తామని చెప్పి ఈరోజు అదే విద్యా విధానాన్ని శరవేగంగా అమలు చేస్తూఉన్నారు. కేరళ తమిళనాడు వంటి రాష్ట్రాలు నూతన విద్యా విధానాన్ని అమలు చేయబోము అని అసెంబ్లీ ద్వారా తీర్మానం చేసుకున్నాయి. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం యదేచ్ఛగా ప్రైవేట్ విద్యా విధానాన్ని పెంపొందించేందుకు P4 విధానాన్ని ముందుకు తీసుకుని వస్తుంది. అదే తరుణంలో కేరళ ప్రభుత్వం విద్యలో మోడల్ గా నిలుస్తుంది. కేరళ ప్రభుత్వం విద్యా విధానంలో ఒక పాలసీని తీసుకుని వచ్చింది బ్యాక్ బెంచ్ ఫ్రంట్ బెంచ్ అనే తారతమ్యాలు లేకుండా విద్యార్థుల్లో ఎటువంటి వివక్షత లేకుండా క్లాస్ రూమ్ లో యు షేప్ విధానాన్ని అమలు చేస్తుంది. కానీ మన రాష్ట్రంలో నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు గతంలో పాదయాత్రలో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జీవో నెంబర్ 77 రద్దు చేస్తామని అదే విధంగా హాస్టల్ భవనాలను నూతనంగా నిర్మిస్తామని చెప్పి ఈరోజు గాలికి వదిలేస్తున్నారు. అంతేకాకుండా జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు అమ్మఒడి ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం రాగానే షరతులు లేకుండా అమ్మ వడిని ప్రతి విద్యార్థికి అందిస్తామని చెప్పి ఈరోజు మాట తప్పి విద్యార్థుల్ని మోసం చేస్తున్నారు. అదే విధంగా భారతదేశంలో ప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుంది ఏ విధంగా అంటే గత మూడు సంవత్సరాలుగా విద్యార్థి నాయకుడైనటువంటి ఉమర్ ఖలీద్ అదే విధంగా అనేక మంది విద్యార్థులపై కేసులను పెడుతుంది బిజెపి ప్రభుత్వం. అంతేకాకుండా ఈరోజు NCERT వంటి టెక్స్ట్ బుక్ లో చరిత్రను మార్చి మతాన్ని చూపించే విధంగా తయారుచేస్తుంది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఏ విధానాల్లో అయితే అనుసరిస్తుందో రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధానాల్ని పక్కాగా మన రాష్ట్రంలో అమలు చేస్తుంది. విద్యార్థుల్ని అణచి ఉంచాలని చూస్తుంది. ప్రపంచ దేశాల్లో విద్యార్థులే ముందుండి నడిపిస్తున్నారు దీనికి ఉదాహరణగా మన పక్కన ఉన్న శ్రీలంక దేశంలో విద్యార్థులే రాజపక్ష ప్రభుత్వాన్ని కూల్చి, విద్యార్థి నాయకుడే ఆ దేశపు ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాడు. అదే విధంగా బంగ్లాదేశ్లో షేక్ హసినా ప్రభుత్వాన్ని కూల్చారు. చిలి,పేరు వంటి దేశాల్లో విద్యార్థుల నాయకులుగా ఉన్నారు. కాబట్టి విద్యార్థి మిత్రులు భవిష్యత్తు పోరాటానికి సిద్ధంగా ఉండాలని నూతన విద్యా విధానంపై అలుపెరిగిన పోరాటం చేయాలని, హాస్టల్ భవనాలకి మెస్ చార్జీలు పెంపుకై, మరో పోరాటానికి నడుం బిగించాలని కోరుతున్నాను అని చెప్పారు. అదేవిధంగా ఈ సభలో ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా అధ్యక్షు, కార్యదర్శిలు D. రాము,ch. వెంకటేష్, లు మరియు అధ్యక్ష వర్గంగా శిరీషగారు,రాజు,రమేష్,మరియు జిల్లా ఆఫీసు బేరర్స్ ,జిల్లా కమిటీ సభ్యులు, ప్రతి నిధులు ,విద్యార్థులు పాల్గొన్నారు