
సాక్షాత్తు ఆ పార్టీ కి చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి సూచనలు,సైగల మేరకు చిత్తూరు నియోజకవర్గ వైకాపా ఇంచార్జ్ విజయానంద రెడ్డి సమక్షం లొనే ఫోటో జర్నలిస్ట్ పై వైకాపా శ్రేణులు దాడి చేయడాన్ని చూస్తే ఆ పార్టీకి,పార్టీ నాయకులకు ప్రజాస్వామ్య వ్యవస్థలపై ఉన్న విశ్వాసం అవగతమౌతోంది.
జర్నలిస్ట్ లకు ఒక సంస్థ శాశ్వతం కాదు. కానీ వృత్తి జీవితం శాశ్వతం.యాజమాన్యాల మీద ఉన్న రాజకీయ కక్షల్ని జర్నలిస్ట్ లపై చూపడం ఆ పార్టీ నాయకులు, శ్రేణుల అసమర్థతకు అద్దం పడుతోంది. గతం లోనూ ఆ పార్టీ నాయకులు పలువురు జర్నలిస్ట్ లపై దాడులకు పాల్పడ్డారు. జర్నలిస్ట్ ల హత్యలకు సహకరించినట్లు కేసులు ఎదుర్కొంటున్నారు.ఓటమి తర్వాత కూడా వారెవరూ మీడియా పట్ల తమ వైఖరి మార్చుకోవడం లేదు.ఇంతకాలం వారి దాడులపై తగిన స్థాయిలో జర్నలిస్ట్ లు, ప్రభుత్వాల నుండి తగిన ప్రతిస్పందన లేకపోవడం కూడా ఇందుకు ఒక కారణం.
జర్నలిస్టులపై జరిగే దాడుల్ని ప్రభుత్వం సీరియస్ గా పరిగణించాలి.
చిత్తూరు లో జరిగిన ఈ సంఘటన పై వెంటనే హత్యాయత్నం నమోదు చేయాలి.
వైకాపా అధిష్టానం కూడా తమ శ్రేణుల్ని నియంత్రించాలి
మరో సారి ఇలాంటి దాడులు జరక్కుండా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి.
లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త నిరసనను ఎదుర్కోవాల్సి వస్తుంది.
: *ఏపీయూడబ్ల్యూజే*
*విజయనగరం జిల్లా శాఖ*