
రేపు మరో 9.51 లక్షలమంది విద్యార్థులకు తల్లికి వందనం డబ్బు జమ చేయనున్నారు. ఫస్ట్ క్లాస్, ఇంటర్ ఫస్టియర్, కేంద్రీయ విద్యాలయాలు, CBSE, నవోదయ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. ఇటీవల వీరిని మినహాయించి మిగిలిన వారికి నిధులు జమ చేసిన విషయం తెలిసిందే. గ్రామ, వార్డు సచివాలయాల్లో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించగా 1.34 లక్షల మంది అర్హులుగా తేలారు. వారికీ రేపు నగదు జమ చేయనున్నారు.