A2Z सभी खबर सभी जिले की

చిన్న చిన్న సమస్య నుంచి మమ్మల్ని ఆదుకోండి –మండల కార్యదర్శి సంఘం

*మంత్రికి సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేసిన కార్యదర్శులు

మెంటాడ, న్యూస్): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన విజన్ 2047 లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి వైపుకు తీసుకువెళ్లే క్రమంలో రాష్ట్ర మొత్తం పంచాయతీ కార్యదర్శులుగా మేము పూర్తిగా సహాయ సహకారాలు అందించుటకు పూర్తిస్థాయిలో మేము సిద్ధంగా ఉన్నామని అది మా బాధ్యతని తెలియజేస్తూ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని స్త్రీ శిశు సంక్షేమ శాఖ, గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్య రాణి కి శనివారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రిని మండల కార్యదర్శుల సంఘం నాయకులు కలుసుకొని తన కష్టాలను వినతిపత్రం ద్వారా తెలియజేశారు. రాష్ట్రంలో గ్రామపంచాయతీలను వీలైనంత త్వరగా పంచాయతీలను అప్గ్రేడ్ చేసి కార్యదర్శులకు పదోన్నత కల్పించాలని, రాష్ట్ర పంచాయతీ కార్యదర్శులకు సచివాలయం డిడిఓ తీసేసి పంచాయతీలకు వర్తించేలా చేయాలని, పంచాయతీ కార్యదర్శులకు వీలైనంత పని ఒత్తిడి తగ్గించాలని తదితర సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేస్తూ చిన్న చిన్న సమస్యల నుంచి ఆదుకుంటారని వేడుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ కార్యదర్శి సంఘం జాయింట్ సెక్రెటరీ ఎల్ ముత్యాలు జిల్లా ఉపాధ్యక్షులు జి కృష్ణ మహేష్ రాము గౌరమ్మ రామయమ్మ తదితర పంచాయతీ కార్యదర్శులుపాల్గొన్నారు.

Show More
Back to top button
error: Content is protected !!