
విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపిఎస్., గారి ఆదేశాలతో జూలై 1న విజయనగరం రూరల్
పోలీసు స్టేషన్ పరిధిలోగల జమ్ము నారాయణపురం హైస్కూల్లో విజయనగరం టాస్క్ఫోర్స్ సిఐ బంగారుపాప, మండల
ఎడ్యుకేషనల్ ఆఫీసర్ సత్యవతి గారు, భారతీయ న్యాయ సేవా ఫౌండేషన్ సంస్థ సహకారంతో జమ్ము నారాయణపురం
హైస్కూల్ విద్యార్థులకు మాదక ద్రవ్యాలు, మత్తు పదార్ధాలు వినియోగం వలన కలిగే దుష్పరిణామాల పట్ల అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా విజయనగరం టాస్క్ ఫోర్సు సిఐ బంగారుపాప మాట్లాడుతూ – యువత మత్తు పదార్ధలకు
అలవాటుపడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు. ప్రజలెవ్వరూ మాదక ద్రవ్యాల జోలికి పోవద్దని, మద్యపానానికి,
ధూమపానానికి దూరంగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. మత్తు పదార్థాలకు అలవాటు పడినవారు అనేక దుష్పరిణామాలకు గురవుతారన్నారు. చెడు సహవాసాలతో, వ్యసనాలకు యువత బానిసై, లక్ష్యంకు దూరం కావద్దన్నారు. మత్తు పదార్థాలకు అలవాటుపడే యువత శారీరక రుగ్మతలకు లోనై, జ్ఞాపకశక్తి కోల్పోయి, విచక్షణ, విజ్ఞత కోల్పోయి, నేరాలకు పాల్పడుతూ, దురదృష్టవసాత్తు కేసుల్లో నిందితులుగా మారుతూ, తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారన్నారు. కావున, మత్తు పదార్థాల వినియోగంకు యువత దూరంగా ఉండాలని, తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు. మత్తు పదార్థాల విక్రయం, రవాణ, వినియోగించే వారి సమాచారాన్ని
డయల్ 100 లేదా 1972 అందించాలని కోరారు. గంజాయి అక్రమ రవాణ కేసుల్లో ఎవరైనా యువత ఒకసారి చిక్కుకొని, అరెస్టు అయినట్లయితే, ఇక వారి భవిష్యత్తు నాశనమైనట్లేనన్నారు. నిందితులపై నేరం రుజువు అయినట్లయితే
10నం.లకు పైబడి జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందన్నారు. యువత చెడు మార్గంలోకి వెళ్ళ కుండా, మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని విద్యార్థులకు సిఐ బంగారుపాప హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో విజయనగరం మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ సత్యవతిగారు, భారతీయ న్యాయ సేవా ఫౌండేషన్ నేషనల్ అడ్వైజర్ శ్రీనివాస్ సోను, సెక్రటరీ విజయకుమార్, సభ్యులు సత్యనారాయణ, కే.ఆర్.కె.రాజు,
హరికృష్ణ, హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు హరికుమార్, ఉపాద్యాయులు మరియు విద్యార్ధులు పాల్గోన్నారు.