A2Z सभी खबर सभी जिले की

మామూలు మత్తులో అధికారులు

విజయనగరం జిల్లా గుర్ల మండలం గూడెం గ్రామ సమీపంలో అక్రమంగా టేకు తోటలో గత నాలుగు రోజులుగా ఆవులను బంధించిన పశు వ్యాపారులు
నీళ్లు దానా లేక రోధిస్తున్న మూగజీవులు పట్టించుకోని అధికారులు.
అక్రమ కభీరాలకు తరలించడానికి సిద్ధంగా ఉన్న పశువులు
ప్రతి వారము వందల సంఖ్యలో తరలిస్తున్న గోవులు నాలుగు రోజులుగా గోవుల అక్రమ నిర్బంధన గుర్తించిన స్థానికులు
ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు
గుర్ల మండలంలో గూడెం గ్రామ సమీపంలో ఒక లేఔట్ టేకు తోట వద్ద నాలుగు రోజులుగా గుర్తుతెలియని వ్యక్తులు పశువులను అక్రమంగా నిర్బంధించారు. వాటిని కబేలాలకు తరలించేందుకని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కొంతమంది స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలో దిగిన గొర్ల పోలీసులు పరిసరాలను పరిశీలించి సమాచారం సేకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే దాదాపుగా 40 ఆవులు నిర్బంధంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గోవులకు నాలుగు రోజుల నుంచి ఆహారం లేక అల్లాడిపోతున్నాయి కనీసం మంచినీళ్లు కానీ మేత మేసేందుకు గడ్డి గాని ఏదీ లేక దీనవస్థలో గోవులు ఉన్నాయి వాటిని చూస్తే మూగజీవులు చెప్పుకోలేని స్థితిలో ఉన్నాయి ఆ ప్రాంతమంతా గోవుల ఆత్మనాథలే వినపడుతున్నాయి విషయం తెలిసిన తర్వాత బిజెపి మండల పార్టీ అధ్యక్షులు కనకరాజు కొరాయి వెంకటప్ప నాయుడు ఆకుల మహేష్ అక్కడ చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు గోవులను రక్షించేందుకు ప్రయత్నాల్లో ఉన్నారు.

Back to top button
error: Content is protected !!