A2Z सभी खबर सभी जिले की

పోలీసుశాఖకు మీరందించిన సేవలు ఎంతో విలువైనవి

*ఆత్మీయ వీడ్కోలు సభలో - విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐ.పి.ఎస్.

సుదీర్ఘ కాలం పోలీసుశాఖలో బాధ్యతాయుతంగా ఎంతో క్రమ శిక్షణతో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేసిన ఆర్మడ్ రిజర్వు విభానికి చెందిన (1) ఆర్.ఎస్.ఐ. సంపతిరావు వెంకట రమణరావు పాత్రుడు (2) ఎ.ఆర్.ఎస్.ఐ. వెంకటేశ్వరరావు (3) హెడ్ కానిస్టేబులు భావన శంకరరావు లకు జిల్లా పోలీసుశాఖ తరుపున
జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ జిల్లా పోలీసు కార్యాలయంలో మే 31న ఘనంగా “ఆత్మీయ వీడ్కోలు” పలికారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ – శాంతిభద్రతల పరిరక్షణలో ఆర్మ్ డ్ రిజర్వు విభాగం చాలా క్రియాశీలకమైనదని, అటువంటి విభాగంలో సమర్ధవంతంగా, ఎంతో క్రమశిక్షణతో విధులు
నిర్వహించిన ముగ్గురు పోలీసు అధికారులు ఉద్యోగ విరమణ చేయడం జిల్లా పోలీసుశాఖకు తీరని లోటేనన్నారు.
మావోయిస్టులు కార్యాకలాపాలను నియంత్రించుటలోను, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టుటలో ఎటువంటి
రిమార్కులు లేకుండా 35-40 సం.లు పోలీసుశాఖకు సేవలందించడం అభినందనీయమన్నారు. ఉద్యోగ బాధ్యతలతో
పాటు, కుటుంబ బాధ్యతలను కూడా చక్కగా నిర్వర్తించి, వారి పిల్లలను మంచి విద్యావంతులుగా తీర్చిదిద్ది, వారు ఉన్నత స్థానంలో నిలిచేలా చేసారన్నారు.
ఉద్యోగ విరమణ తరువాత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, కుటుంబంతో కొంత సమయాన్ని గడపాలని, సమాజానికి
మంచి చేసేందుకు కృషి చేయాలన్నారు. ఉద్యోగ విరమణ చేసిన తరువాత బెనిఫిట్స్ రావడంలో ఇబ్బందులు తలెత్తితే
వాటిని పరిష్కరించేందుకు రిటైర్డ్ ఉద్యోగులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామన్న భరోసాను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్
కల్పించారు.
అనంతరం, ఉద్యోగ విరమణ చేసిన ఆర్ఎస్ఐ ఎస్.వి.ఆర్. పాత్రుడు, ఎఆర్ఎస్ఐ జి.వెంకటేశ్వరరావు మరియు ఎఆర్ హెచ్సీ భావన శంకరరావు దంపతులను జిల్లా పోలీసుశాఖ తరుపున జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ సాలువలతోను, పూలమాలలతో ఘనంగా సత్కరించి, జ్ఞాపిక, సన్మాన పత్రాలను ప్రధానం చేసి, ఘనంగా “ఆత్మీయ
వీడ్కోలు” పలికారు. అదే విధంగా జిల్లా కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ తరువున జిల్లా ఎస్పీ గిఫ్ట్, చెక్ లను అందజేసారు. ఉద్యోగ విరమణ చేసిన అధికారులు మాట్లాడుతూ తమ సర్వీసులో సహాయ, సహకారాలను
అందించిన అధికారులు, సహోద్యోగులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడ్మిన్ అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎఆర్ అదనపు ఎస్పీ ఎఆర్ జి.నాగేశ్వరరావు, ఎస్బీ సిఐలు ఎ.వి.లీలారావు, ఆర్.వి.కె.చౌదరి, రిజర్వు ఇన్స్పెక్టర్లు ఎన్.గోపాల నాయుడు, టి.శ్రీనివాసరావు, ఆర్.రమేష్
కుమార్, పలువురు ఆర్.ఎస్.ఐ.లు పోలీసు అసోసియేషను అధ్యక్షులు కే.శ్రీనివాసరావు మరియు ఉద్యోగ విరమణ
చేస్తున్న పోలీసు ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని, ఉద్యోగ
విరమణ చేస్తున్న ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు.

 

Back to top button
error: Content is protected !!