A2Z सभी खबर सभी जिले की

హనుమాన్ జయంతి ర్యాలీలో పాల్గొన్న సిరి సహస్ర (సిరమ్మ)

తేది:22/05/2025
విజయనగరం.
ఈరోజు 22 మే 2025 , విజయనగరం టౌన్ లో బొంకుల దిబ్బ , కోట ఎదురుగా హిందూ ధర్మ రక్షా సమితి ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి సందర్బంగా జరుగు హనుమాన్ జయంతి ర్యాలీ లో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ , వై.యస్.ఆర్.సి.పి. జిల్లా అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గం సమన్వయ కర్త శ్రీ మజ్జి శ్రీనివాస రావు (చిన్న శ్రీను ) గారి కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర (సిరమ్మ) పాల్గొన్నారు. హిందూ ధర్మ రక్షా సమితి సభ్యులు సిరమ్మకు ఘనస్వాగతం పలికారు. తదుపరి ఆమె ర్యాలీ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ నేటి యువత హనుమాన్ చాలీసా తప్పనిసరిగా రోజూ చదవాలన్నారు… భారతదేశ గొప్పతనం దాని లోనే ఉందన్నారు.. సనాతన ధర్మ విశిష్టత ప్రతి ఒక్కరు తెలుసు కోవాలని కోరారు… హిందూ ధర్మ రక్షా సమితి సభ్యులు చేసిన ఈ మహత్తరమైన ర్యాలీకి అభినందనలు తెలిపారు.

Back to top button
error: Content is protected !!