A2Z सभी खबर सभी जिले की

జాతీయస్థాయి పవర్ లిఫ్టింగ్లో ప్రతిభ కనబర్చిన ఎఎస్ఐ త్రినాధరావు

* అభినందించిన - విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్*

 

 

 

Related Articles

ఇటీవల కేరళ రాష్ట్రం ఎర్నాకుళంలో నిర్వహించిన జాతీయస్థాయి డెడ్ లిఫ్ట్ & బెంచ్ ప్రెస్ వెయిట్ లిఫ్టింగ్
ఛాంపియన్ షిప్ 2025 పోటీల్లో పాల్గొని నాలుగు బంగారు పతకాలు, నాలుగు సిల్వర్ పతకాలు సాధించిన విజయ నగరం 1వ పట్టణ పోలీసు స్టేషన్ లో ఎఎస్ఐగా పని చేస్తున్న ఆలి త్రినాధరావును మరియు ఉద్యోగ విరమణ చేసిన ఆర్మ్డ్ రిజర్వు హెచ్సీ మజ్జి శంకరరావులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మే 8న పోలీసు కార్యాలయంలో అభినందించారు.
జాతీయస్థాయిలో బంగారు, సిల్వరు పతకాలు సాధించిన ఎఎస్ఐ ఆల్తి త్రినాధరావు, రిటైర్డ్ ARHC మజ్జి శంకరరావులు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపిఎస్ గార్ని పోలీసు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలవగా, జిల్లా ఎస్పీగారు ఇరువురి
క్రీడా ప్రతిభను ప్రశంసించి, అభినందించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ – పవర్ లిఫ్టింగులో 93కిలోలు మరియు 60+
విభాగంలో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని, నాలుగు బంగారు పతకాలు సాధించిన ఎఎస్ఐ ఆల్తి త్రినాధరావు మరియు 74 కిలోలు మరియు 70+ విభాగంలో పాల్గొని నాలుగు సిల్వర్ పతకాలు సాధించిన మజ్జి శంకర్రావులు మిగిలిన పోలీసు ఉద్యోగులకు ఫిట్నెస్ మేనేజ్మెంట్లో ఆదర్శంగా నిలిచారన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో భూటాన్లో నిర్వహించే అంతర్జాతీయ పోటీల్లో కూడా పాల్గొని, మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఇటీవల కేరళ రాష్ట్రం ఎర్నాకుళంలో పాన్ ఇండియా మాస్టర్స్ గేమ్స్ ఫెడరేషను ఆధ్వర్యంలో జరిగిన జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగు & పవర్ లిఫ్టింగు ఛాంపియన్ షిప్ 2025 పోటీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరుపున ఎఎస్ఐ
త్రినాధరావు పాల్గొని బెంచ్, డెడ్ లిఫ్ట్ మరియు స్క్వాట్ విభాగాల్లో ప్రతిభ కనబర్చి, జాతీయ స్థాయిలో నాలుగు బంగారు
పతకాలు సాధించారన్నారు. అదే విధంగా జిల్లా పోలీసుశాఖ ఆర్మ్ డ్ రిజర్వు విభాగంలో ARHC గా పని చేసి,ఉద్యోగ విరమణ చేసిన మజ్జి శంకర్రావు కూడా ఈ పోటీల్లో 74 కిలోలు మరియు 70+ విభాగంలో పాల్గొని, బెంచ్, డెడ్ లిఫ్ట్ మరియు స్వ్కాట్ విభాగాల్లో ప్రతిభ కనబర్చి నాలుగు సిల్వర్ మెడల్సు ను సాధించారన్నారు.
ఈ కార్యక్రమంలో విజయనగరం 1వ పట్టణ సిఐ ఎస్.శ్రీనివాస్, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

 

Show More
Back to top button
error: Content is protected !!