విజయనగరంలోని నీట్ పరీక్షా కేంద్రాన్ని జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్ ఆదివారం పరిశీలించారు.ఆయన జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని తనిఖి చేశారు. పరీక్షా ఏర్పాట్లు, విద్యార్థులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలు, భద్రత, బందోబస్తు తదితర ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, ఎటువంటి తప్పిదాలు జరగకూడదని అధికారులను ఆదేశించారు.
0 Less than a minute


