A2Z सभी खबर सभी जिले की

“స్వచ్ భారత్” చేపట్టిన ‘వాకర్స్ క్లబ్బులు’

సేవా కార్యక్రమాల్లో భాగంగా శ్రీ సాయి కృష్ణా వాకర్స్ క్లబ్, అంజనీ పుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో “స్వచ్ భారత్” కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం అయ్యన్నపేట జంక్షన్ వద్దనున్న మున్సిపల్ కార్పొరేషన్ నడక మైదానంలో శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ముందుగా క్లబ్ సభ్యులంతా నడక మైదానంలో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని అంతా ఏరివేసిన నంతరం వయ్యారిభామ మొక్కలు,పిచ్చిమొక్కలను, తొలగించి శుభ్రపరిచారు.

ఈ సందర్భంగా శ్రీ సాయి కృష్ణా వాకర్స్ క్లబ్ అధ్యక్షులు తాడ్డి ఆదినారాయణ, అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు (బాలు) మాట్లాడుతూ సేవాకార్యక్రమాల్లో భాగంగా స్వచ్ భారత్ కార్యక్రమాన్ని చేపట్టామని, ప్రజలంతా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి కాలుష్యనివారణకు నడుబిగించాలని, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ముందుకెళ్తామని అన్నారు.

Related Articles

~త్యాడ రామకృష్ణారావు(బాలు)

Show More
Back to top button