A2Z सभी खबर सभी जिले की

గంజాయి కేసుల్లో నిందితుల ఆర్థిక మూలాలను వెలికి తీయాలి

*- విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్*

 ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జూలై 16న సందర్శించి, పోలీసు స్టేషను రికార్డులు, సిడి ఫైల్స్ ను పరిశీలించి, గంజాయి కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తుల ఆర్థిక మూలాలను

వెలికితీయాలని, గంజాయి వ్యాపారంతో సంపాదించిన ఆస్తులను జప్తు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ మాట్లాడుతూ – గంజాయి కేసుల్లో నిందితులుగా ఉన్న
వ్యక్తుల ఆర్ధిక మూలాలను వెలికి తీయాలని, గంజాయి వ్యాపారంతో సంపాదించిన ఆస్తులను గుర్తించి, వాటిని జప్తు
చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గంజాయి కేసుల్లో మరింత లోతైన దర్యాప్తు చేయాలన్నారు.
రహదారి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, బ్లాక్ స్పాట్స్ వద్ద హెచ్చరిక బోర్డులను, స్టాపర్లు, లైటింగు ఏర్పాటు చేయాలన్నారు. హిట్ అండ్ రన్ కేసుల్లో క్రైం వాహనాలను త్వరితగతిన గుర్తించేందుకు చర్యలు
చేపట్టాలని, నిందితులను అరెస్టు చేయాలని, బాధితులకు పరిహారం అందే విధంగా చూడాలన్నారు. అనంతరం, పోలీసు
స్టేషనులోని వివిధ రికార్డులు, సిడి ఫైల్స్ ను, జనరల్ డైరీ, బెయిల్ బుక్లను తనిఖీ చేసి, అధికారులకు దిశా నిర్ధేశం చేసారు. రికార్డులు, సిడి ఫైల్స్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుండాలి, దర్యాప్తు వివరాలను సిసిటిఎన్ఎస్లో నమోదు చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు.
పోలీసు స్టేషనును జిల్లా ఎస్పీగారు తనిఖీచేసే సమయంలో విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు, భోగాపురం
సిఐ జి.రామకృష్ణ, డెంకాడ ఎస్ఐ ఎ.సన్యాసి నాయుడు మరియు ఇతర పోలీసు సిబ్బంది హాజరుగా ఉన్నారు.

Back to top button
error: Content is protected !!