
కూటమి ప్రభుత్వంతోనే సుపరిపాలన సాధ్యమని మెంటాడ మండల తెలుగుదేశం పార్టీఅధ్యక్షులు చలుమూరి వెంకట్రావు అన్నారు. శనివారం మెంటాడ మండలంలోని పోరాం మరియు బుచ్చి రాజు పేట గ్రామంలో సాలూరు శాసనసభ్యురాలు గిరిజన శాఖ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆదేశాలతో… సుపరిపాలన తొలి ఏడాది కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు చలుమూరి వెంకట్రావు ఆధ్వర్యంలో ప్రజలకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి సంవత్సరంలో జరిగిన సంక్షేమం మరియు అభివృద్ధిని కరపత్రాల రూపంలో ఇంటింటికి తిరిగి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చలుమూరి వెంకట్రావు మాట్లాడుతూ గతంలో పంచాయితీలో ఏమైనా అభివృద్ధి జరిగిందంటే చంద్రబాబు నాయుడు హయాంలోనే జరిగిన అభివృద్ధి తప్ప మరే ప్రభుత్వం చేయలేదని అన్నాను. ఎన్టీఆర్ భరోసా పింఛన్, మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం పథకాల గురించి ఆరా తీశారు. అన్నదాత సుఖీభవ, ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకంను కూటమి ప్రభుత్వం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమం లో అరుకు పార్లమెంట్ ఉపాధ్యక్షులు గెద్ద అన్నవరం సాలూరు ఏ.యమ్.సి డైరెక్టర్ రాజు మెంటాడ పిఎసిఎస్ అధ్యక్షులు గొర్లె ముసలి నాయుడు జక్కువ పిఎసిఎస్ అధ్యక్షులు ఆర్నపిల్లి సత్యం కొల్లు అప్పారావు రెడ్డి గోవింద్ రెడ్డి సత్యనారాయణ తాడ్డి తిరుపతి సిరిపురం గురు నాయుడు రెడ్డి ఎర్రి నాయుడు జక్కువ పిఎసిఎస్ డైరెక్టర్ కుంచు వెంకటి పొట్నూరు రామలింగేశ్వర రావు విద్యా కమిటీ చైర్మన్ చంద్రునాయుడు యవర్ని అప్పారావు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.