
విజయనగరం స్థానిక నోబెల్ నగర్ లో కల శ్రీ చైతన్య CBSE స్కూల్ ప్రాంగణంలో గ్రీన్ ఇండియా మిషన్ లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం సందర్భంగా రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్,జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి & విజయనగరం నియోజకవర్గం ఇంచార్జి శ్రీమతి పాలవలస యశస్వి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె పాఠశాల విద్యార్థులు, అధ్యాపకులను ఉద్దేశించి స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేశారు.
వాతావరణ పరిరక్షణలో మొక్కల ప్రాముఖ్యతను వివరిస్తూ, “ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి, దానిని పెంచి సంరక్షించాలి,” అని ఆమె సూచించారు. యువతలో సహజసిద్ధంగా ఉన్న శక్తిని సద్వినియోగం చేసుకుంటూ సమాజ సేవలో భాగస్వాములవ్వాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులు మొక్కలు నాటడంలో చురుకుగా పాల్గొనడం విశేష ఆకర్షణగా నిలిచింది.
ఈ కార్యక్రమం లో విజయనగరం నియోజకవర్గం టౌన్, మండల నాయకులు పాల్గొన్నారు.