A2Z सभी खबर सभी जिले की

జిందాల్ నిర్వాసితులు *చలో ఢిల్లీ*

జిందాల్ నిర్వాసితులను రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు గానీ ప్రజా ప్రతినిధులు గాని, అధికారులు కానీ పట్టించుకోకపోవడంతో MLC రఘరాజు నేత్రత్వంలో, ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్ ఆధ్వర్యంలో సోమవారం అర్ధరాత్రి తర్వాత విశాఖ చేరుకొని అక్కడ నుంచి భారతదేశ రాజధాని ఢిల్లీకి చలో బయలుదేరారు ఈ సందర్భంగా చల్లా జగన్ మాట్లాడుతూ గత 80 రోజులుగా సర్వం కోల్పోయిన జిందాల్ బాదితులు “మా భూమి వమాకు ఇచ్చి” ఆదుకోవాలని పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ పెద్దల గాని జిల్లా నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు గాని దళిత గిరిజన నిర్వాసితులను కన్నెత్తి కూడా చూడడం లేదన్నారు జిందాల్ యాజమాన్యానికి అందరూ అనుకూలంగా మారడంతో తమ గోడు వినిపించేందుకు దేశ రాజధాని ఢిల్లీకి బయలుదేరుతున్నట్టు జగన్ తెలిపారు కంపెనీ పేరుతో పేదల వద్ద ఉన్న ఢీ పట్టా భూములు మొత్తం దోచుకొని నిర్వాసితులకు అన్యాయం చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం ధారుణం అన్నారు భూములు తీసుకున్నప్పుడు ఆ భూముల్లో కంపెనీ కట్టి మీకు ఉపాధి కల్పిస్తాం, అందరికీ ఉద్యోగాలు ఇస్తాం, భూమి విలువకు సరిసమానమైన షేర్లు రూపంలో వాటా ఇస్తాం అని చెప్తేనే పేదలందరూ భూములు ఇచ్చేందుకు సిద్ధపడ్డారని కానీ నేడు నిర్వాసితులను పక్కనపెట్టి ప్రభుత్వ పెద్దలతో జిందాల్ యాజమాన్యం అవగాహన కల్పించుకొని పారిశ్రామిక రియల్ ఎస్టేట్ కు తెగబడ్డంతో దిక్కు తోచని స్థితిలో మూడు నెలలుగా ఆందోళన నిర్వహిస్తున్న అందరూ ఒక్కటై దళిత గిరిజనులను అన్యాయం చేసేందుకు సిద్ధపడుతున్నారని అన్నారు
ఇదే విషయాన్ని ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి, మానవ హక్కుల సంఘాలకి తెలియజేసేందుకు ఢిల్లీ వెలుతున్నట్టు జగన్ తెలిపారు, ఢిల్లీలో ఆందోళన చేసేందుకు ముందస్తు అనుమతులు కూడా తీసుకున్నామని జగన్ తెలిపారు, నిర్వాసితులు ఉన్న ప్రాంతంలో ధర్నా చేసేందుకు స్థానిక ఏపీ పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా ఢిల్లీ పోలీసులు అనుమతినివ్వడం సంతోషదాయకమన్నారు మా ఢిల్లీ పోరాటం తోటైనా నిర్వాసితులకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామన్నారు,

Show More
Back to top button