
ప్రజారోగ్య పరిరక్షణ సామాజిక బాధ్యతని విజయనగరం నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ కిల్లాన అప్పలరాజు అన్నారు. శనివారం స్వర్థాంధ్ర స్వచ్చాంద్ర కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య పరిరక్షణ అనే అంశంపై వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. విజయనగరంలో ఎస్బిఐ మెయిన్ బ్రాంచ్ వద్దనున్న గాంధీ విగ్రహం వద్ద మానవహారం నిర్వహించారు. అనంతరం బాపూజీ విగ్రహం వద్ద స్వర్ణాంధ్ర-స్వచ్చాంద్ర ప్రతిజ్ఞను చేశారు.