A2Z सभी खबर सभी जिले की

ట్రాఫిక్ రెగ్యులేషను, రహదారి భద్రతకు జిల్లాకు క్రొత్తగా 16 మోటారు సైకిళ్ళు కేటాయింపు

*- విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్*

విజయనగరం జిల్లాలో ట్రాఫిక్ రెగ్యులేషను, రహదారి భద్రత కోసం జిల్లాకు క్రొత్తగా 16 మోటారు సైకిళ్ళును
రాష్ట్ర డిజిపి కార్యాలయంలోని పి.టి.ఓ. కేటాయించినట్లు, సదరు మోటారు సైకిళ్ళు జిల్లా కేంద్రానికి చేరుకున్నట్లుగా
జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ జూన్ 25న తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలో పార్కింగు చేసిన నూతన మోటారు సైకిళ్ళును జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ మాట్లాడుతూ – రహదారి భద్రత మరియు ట్రాఫిక్ రెగ్యులేషను విధులను సమర్ధవంతంగా నిర్వహిచేందుకు విజయనగరం జిల్లాకు క్రొత్తగా 16 మోటారు సైకిళ్ళును రాష్ట్ర డిజిపి కార్యాలయం కేటాయించిందన్నారు. వీటిలో 15 టివిఎస్ అపాచీ మోటారు సైకిళ్ళు, ఒక రాయల్ ఎన్ఫీల్డ్ మోటారు సైకిలు కలవన్నారు. ఈ మోటారు సైకిళ్ళుకు సైరన్, బ్లింకర్స్. పబ్లిక్ అడ్రసింగ్ సిస్టం, క్రౌడు కంట్రోల్ చేసేందుకు అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించారన్నారు. ఈ మోటారు సైకిళ్ళును జిల్లాలో ట్రాఫిక్ అవాంతరాలు
తరుచూ ఏర్పడుతున్న పోలీసు స్టేషన్లుకు, రహదారి ప్రమాదాలు తరుచూ జరుగుతున్న పోలీసు స్టేషన్లుకు కేటాయించనున్నా మన్నారు. ఈ మోటారు సైకిళ్ళును సంబంధిత పోలీసు స్టేషను సిబ్బంది వినియోగించి, ట్రాఫిక్ అవాంతరాలు
ఏర్పడిన ప్రాంతాలకు, రహదారి ప్రమాదాలు జరిగిన సంఘటన స్థలాలకు శీఘ్రంగా చేరుకొని అవకాశం ఉంటుందన్నారు. ఫోర్ వీలర్స్ వెళ్ళలేని మారుమూల ప్రాంతాలకు కూడా ఈ మోటారు సైకిళ్ళును వినియోగించి, పోలీసు సిబ్బంది, అధికారులు చేరుకొనే అవకాశం ఉంటుందన్నారు. ప్రధాన రహదారులు, ట్రాఫిక్ హబ్లలో సత్వర చర్యలు
చేపట్టడమే కాకుండా ట్రాఫిక్ నియంత్రణ, రహదారి భద్రత నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నామన్నారు. ప్రజలు కూడా తమవంతు సహకారాన్ని పోలీసుశాఖకు అందించాలని, రహదారి భద్రత నియమాలను ప్రతీ ఒక్కరూ పాటించాలని, రహదారి ప్రమాదాల నియంత్రణలో ప్రజలంతా భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్
కోరారు.
ఈ కార్యక్రమంలో ఎస్బీ సిఐలు ఎ.వి.లీలారావు, ఆర్.వి.ఆర్.కే.చౌదరి, ఆర్ఎస్ఐ (ఎం.టి.ఓ) ఆర్.రమేష్కుమార్,
ఆర్ఎస్ఐ (అడ్మిన్) ఎన్.గోపాలనాయుడు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles
Show More
Check Also
Close
Back to top button
error: Content is protected !!