
సంతకవిటి మండల పరిధి పొనుగుటివలస గ్రామ సమీపంలో ఓ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులకు చిన్నచిన్న ప్యాకెట్లుగా చేసి గంజాయి అమ్ముతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో దాడి చేసి బి.దుర్లాప్రసాద్, షేక్ రఫీ, కె.ఉదయ్, ఏ.చంద్రశేఖర్‌ను అరెస్టు చేశామని ఎస్‌ఐ ఆర్.గోపాలరావు తెలిపారు. వీరంతా పాలకొండకు చెందిన వారు కాగా… వారి వద్ద 4.80కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.