రాజాంలోని గాయత్రీ కాలనీకి చెందిన పి.కుమారి(45) నాలుగేళ్ల క్రితం తన రెండవ కుమారుడు మరణించడంతో మానసికంగా కృంగిపోయింది. అప్పటి నుంచి ఆమెకు కుటుంబ సభ్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ నెల 20న శ్రీకాకుళంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స చేయించి ఇంటికి తీసుకొచ్చారు. అదే రోజు రాత్రి బయటికి వెళ్ళిన ఆమె తెలగ వీధిలోని నేలబావిలో పడి మృతి చెందింది. కుమారుడు సాయితేజ ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్సై రవికిరణ్ కేసు నమోదు చేశారు.