మెంటాడ: మెంటాడ మండలంలోని జి.టి.పేట గ్రామంలో ఆలయ కమిటీ చైర్మన్ చొక్కకు సన్యాసినాయుడు (అమ్మ స్వచ్ఛంద సంస్థ చైర్మన్) ఆధ్వర్యంలో గురువారం ఉదయం అభయాంజనేయ స్వామి జయంతి వేడుకలు జరిగాయి.జి.టి.పేట గ్రామంలో అభయాంజనేయ స్వామి ఆలయంలో వైభవంగా వేడుకలు ఘనంగా జరిపారు. స్వామివారికి విశేష అభిషేక పూజలతో పాటు పంచకుండాత్మక హనుమాన్ కవచహపసం, పూజలు యజ్ఞలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలో ఉన్న భక్తులందరూ పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకొని పూజలు నిర్వహించారు. ఆలయం ప్రధాన అర్చకులు బి. కృష్ణమూర్తి ఆధ్వర్యంలో పూజలు జరిపారు. అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో ఉదయం నుంచి భక్తి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు సేకరించి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ కమిటీ చైర్మన్ దంపతులుచొక్కాకు సన్యాసినాయుడు సతీమణిచొక్కాకు కొండమ్మతెలిపారు. కార్యక్రమంలో గ్రామంలో ఆంజనేయస్వామి భక్తులు గ్రామ పెద్దలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.