మెంటాడ, న్యూస్): గత కొంతకాలంగా కురుస్తున్న భారీ వర్షాలకు మెంటాడ మండలం బడేవలస గ్రామ పరిధిలోని కోనేటి లింగాల గెడ్డకు గండిపడి సుమారు 100 ఎకరాల పంట ముంపున కు గురైనట్లు రైతులు ఆందోళన చెందుతున్నారు. నీటి తీవ్రత ఎక్కువై పంటలు మునిగి పాడైపోతాయోమోనన్నా ఆందోళన రైతుల్లో నెలకొంది. ఎకరాకు సుమారు 15000 మదుపు పెట్టి వరి నాట్లు వేసినట్లు రైతులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి పీడిక రాజన్న దొర సంఘటన స్థలానికి చేరుకొని నీటి ప్రవాహాన్ని కోనేటి గెడ్డ గండి పడ్డ విధానాన్ని పరిశీలించారు. ఈ నేపథ్యంలో పీడిక రాజన్న దొర రైతులతో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గండి పునరుద్ధారణకు, రైతులకు నష్టపరహారం అందేలా చర్యలు తీసుకునేలా సంబంధిత అధికారులతో మాట్లాడతానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షులు రాయపల్లి రామారావు, వైస్ ఎంపీపీ సారిక ఈశ్వరరావు, బాయి అప్పారావు, గేదెల సతీష్, సిరి శెట్టి నారాయణరావు, మండల వ్యవసాయ శాఖ అధికారి గోకుల కృష్ణ, రైతులు పాల్గొన్నారు.