శాంతిభద్రతల పరిరక్షణలో మీ సేవలు శ్లాఘనీయం

*- విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐ.పి.ఎస్.*

సుదీర్ఘ కాలం పోలీసుశాఖలో బాధ్యతాయుతంగా, ఎంతో క్రమ శిక్షణతో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేసిన హెూంగార్డులు (1) కే.సూర్యనారాయణ (2) ఎం.వెంకట రామకృష్ణా రావు లను జిల్లా పోలీసుశాఖ తరుపున జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ జిల్లా పోలీసు కార్యాలయంలో సెప్టెంబరు 2న మనంగా సత్కరించి “ఆత్మీయ వీడ్కోలు” పలికారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ – శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు విధులను ఎంతో సమర్ధవంతంగా నిర్వహించడం చాలా కష్టతరమన్నారు. అటువంటి విధులను నిర్వహించి, పోలీసుశాఖకు
చేదోడు వాదోడుగా సుదీర్ఘ కాలం హెూంగార్డుగా సేవలందించడం అభినందనీయమన్నారు. క్లిష్ట పరిస్థితులు, విభిన్న వాతావరణంలో విధులు నిర్వహించడంతో తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టలేని పరిస్థితులు ఉంటాయన్నారు.
ఉద్యోగ విరమణ తరువాత ఇకపై తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఉద్యోగ విరమణ చేసిన హెూంగార్డ్సుకు జిల్లా ఎస్పీ సూచించారు. నేడు ఉద్యోగ విరమణ చేస్తున్న కే.సూర్యనారాయణ పోలీసుశాఖలో హెూంగార్డుగా 41నం.లు, ఎం.వెంకట రామకృష్ణా రావు 32 నం.లు పని చేసారన్నారు. విధి నిర్వహణలో రాత్రి గస్తీలు, బందోబస్తులు వంటి పోలీసు విధులను సమర్ధవంతంగా నిర్వహించారని వారి సేవలను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ కొనియాడారు.
అనంతరం, ఉద్యోగ విరమణ చేసిన హెూంగార్డ్సు (1) కే.సూర్యనారాయణ (2) ఎం.వి.రామకృష్ణారావు
దంపతులను జిల్లా పోలీసుశాఖ తరుపున ఎస్పీ వకుల్ జిందల్ ప్రత్యేకంగా అభినందించి, సాలువలతోను, పూల
మాలలతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికను ప్రధానం చేసి, ఘనంగా “ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఉద్యోగ విరమణ చేసిన హెూంగార్డ్సు మాట్లాడుతూ తమ సర్వీసులో సహాయ, సహకారాలను అందించిన అధికారులు, సహచర
సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఆర్.రమేష్ కుమార్, ఇనార్జ్ హెచ్.సి.రాజు, ఉద్యోగ విరమణ చేస్తున్న హెూంగార్డ్సు, వారి కుటుంబ సభ్యులు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని, ఉద్యోగ విరమణ చేస్తున్న ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు.

Exit mobile version