విద్యారంగ సమస్యల పరిష్కారానికై దద్దరిల్లిన కలెక్టరేట్

* 3000 మంది విద్యార్థులతో కలెక్టరేట్ ముట్టడించిన ఎస్ఎఫ్ఐ * వారం రోజుల్లో సమస్య పరిష్కారం కాకపోతే అసెంబ్లీ ముట్టడిస్తామని పిలుపు

జిల్లా వ్యాప్త విద్యారంగ సమస్యల పరిష్కారానికి భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) విజయనగరం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులతో భారీ ర్యాలీగా కాంప్లెక్స్ నుంచి కలెక్టరేట్ వద్దకు చేరుకొని కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి రాము, సిహెచ్ వెంకటేష్ లు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి 15 నెలల గడుస్తున్న విద్యారంగ సమస్యల పరిష్కార దిశగా కృషి చేయడం లేదని దుయ్యబట్టారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి కుమారుడే విద్యాశాఖ మంత్రిగా ఉన్న విద్యాశాఖ పరిస్థితి రోజురోజుకు దౌర్భాగ్యమైన స్థితికి వెళ్తుందని విమర్శించారు. దాదాపుగా రాష్ట్రంలో ఉన్నత విద్య చదివే విద్యార్థులకు 6400 కోట్ల రూపాయల స్కాలర్షిప్ పెండింగ్ ఉందని తక్షణమే వాటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్కాలర్షిప్లు విడుదల కాకపోవడంతో చదువు పూర్తి చేసిన విద్యార్థులు సర్టిఫికెట్స్ పొందలేక అనేక ఇబ్బందులకు పడుతున్నారని కావున విద్యాశాఖ మంత్రి తక్షణమే స్కాలర్షిప్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా విజయనగరం జిల్లాలో గజపతినగరం, విజయనగరం, రాజాం ప్రాంతాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల అడ్రస్ లేకుండా గల్లంతయిందని దుయ్యబట్టారు. దీనికి ప్రధాన కారణం సొంత భవనాలు లేకపోవడమేనని దుయ్యబట్టారు. నిర్మాణం చేయకుండా విద్యాశాఖ చదువు ఎలా చెప్తుందని విమర్శించారు. తక్షణమే ఈ మూడు ప్రాంతాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణం చేయాలని కోరారు. వీటితోపాటు జిల్లా వ్యాప్తంగా సంక్షేమస్టళ్ల పరిస్థితి అద్వానంగా తయారైందని , శిథిలావస్తలో ఉన్న సంక్షేమ హాస్టల్స్ కి సొంత భవనాలు నిర్మించాలని , మరియు మెస్ ఛార్జీలు 3000 పెంచాలని డిమాండ్ చేశారు. రెండేళ్ల క్రితం ఇప్పటి విద్యాశాఖ మంత్రి అప్పటి ప్రతిపక్ష నాయకుడు నారా లోకేష్ పాదయాత్రలో జీవో నెంబర్ 77 రద్దు చేస్తామని హామీ ఇచ్చారని , అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్న ఆ హామీ గాలి మాటలకే పరిమితమైందని విమర్శించారు. తక్షణమే GO నెంబర్ 77 రద్దుచేసి పీజీ విద్యార్థులకు స్కాలర్షిప్ అందజేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నారని ఇదే సందర్భంలో విద్యార్థినులకు వారు మహిళలైనా సరే బడి బస్సుల్లో వేలాది ఫీజులు చెల్లిస్తూ బస్పాసులు తీసుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఎదురైందని ,కావున తక్షణమే విద్యార్థులందరికీ ఉచిత బస్సు పాసులు అందించాలని డిమాండ్ చేశారు. వీటితోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న యూనివర్సిటీ VC పోస్టులను, లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్న JNTUGV కి నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ నిర్మాణం వేగవంతం చేయాలని, అలాగే సెంట్రల్ యూనివర్సిటీలో అవసరానికి తగ్గ ప్రొఫెసర్ పోస్టులను సాంక్షన్ చేసి భర్తీ చేయాలని కోరారు. మెడికల్ కళాశాల నిర్మాణం అర్ధాంతరంగా ఆపేసారని రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాల నిర్మాణం వేగవంతం చేసి కళాశాలలో ఉన్న సీట్లన్నీ కన్వీనర్ కోటాలోనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఇన్ని సమస్యలతో విద్యార్థులు కొట్టుమిట్టాడుతుంటే సమస్యలు తీర్చాల్సిన రాష్ట్ర ప్రభుత్వం సమస్యలను ప్రశ్నిస్తున్న విద్యార్థి సంఘాల నిషేధ సర్కులర్ తీసుకురావడం సిగ్గుచేటేకాక చేతకానితనమని విమర్శించారు. ప్రభుత్వంలో ఉన్నవారు కూడా విద్యార్థి సంఘాల పోరాటాల ద్వారానే నాయకులుగా ఎదిగి అధికారంలోకి వచ్చేమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని, లేని పక్షంలో తమ పతనానికి తామే కొని తెచ్చుకున్నట్టు అవుతుందని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఆ రాజ్యాంగ విరుద్ధ సర్కిలర్ను వెనక్కి తీసుకోవాలని కోరారు. అనంతరం విద్యార్థి ప్రతినిధులు ఎస్ఎఫ్ఐ నాయకులు కలిసి జిల్లా జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ గారికి వినతిపత్రం అందజేశారు. అనంతరం విద్యారంగ సమస్యల పరిష్కారమ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని, దీనికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల పక్షాన ఏడు రోజులు గడువిస్తున్నామని ,ఈ గడువులోపు సమస్యలు పరిష్కారం చేయకపోతే వేలాదిగా రాష్ట్ర అసెంబ్లీని ముట్టడిస్తామని తెలిపారు. దీనికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో SFI జిల్లా ఉపాధ్యక్షులు జ్. రవికుమార్, మ్. వెంకీ, సమీరా, రమేష్, జిల్లా సహాయ కార్యదర్శులు శిరీష , రాజు జిల్లా కమిటీ సభ్యులు భారతి , రూప , సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version