విజయనగరం జిల్లా లో స్త్రీ శక్తి పథకం ఆరంభించాక తొలివారం 3,26,939 మంది మహిళలు ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకున్నారని జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీమతి జి.వరలక్ష్మి తెలిపారు. సోమవారం ఆమె కార్యాలయంలో మాట్లాడుతూ ఆగస్టు 15వ తేది న ఈ పథకం ప్రారంభం కాగా, 24 వ తేది వరకు పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్స్, ఎక్స్ప్రెస్ వంటి నాలుగు రకాల బస్సులలో మొత్తం 6,17,206 మంది ప్రయాణించారన్నారు వీరిలో మహిళలు 3,26,939 మంది కాగా టికెట్లు తీసుకుని ప్రయాణించిన పురుషులు 2,90,499 మంది ఉన్నారు ఈ విధంగా వారం రోజుల్లో కలిపి మహిళలకు రూపాయలు 1,22,56,345 మేరా ఈ పథకం ద్వారా లబ్ధి కలిగిందన్నారు. స్త్రీ శక్తి పథకం ఆరంభమయ్యాక 04 రకాల బస్సుల్లో మహిళ ప్రయాణికులు క్రమంగా పెరుగుతుండగా పురుషుల సంఖ్య తగ్గుతుందని, గతంలో సగటున పురుష మహిళ ప్రయాణికుల నిష్పత్తి 65:35 గా ఉండేదని స్త్రీ శక్తి పథకం మొదలయ్యాక పురుష ప్రయాణికుల సంఖ్య 40% ఉండగా, మహిళా ప్రయాణికుల సంఖ్య 60% పెరిగినట్లు ఆమె తెలియజేశారు.