మెంటాడ, న్యూస్: గ్రామాలు పరిశుభ్రంగా ఉండటం ద్వారా వ్యాధులు దరి చేరవని ప్రతి ఒక్కరూ గ్రామాలు పరిశుభ్రతపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని తాసిల్దార్ అరుణ కుమారి అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమం ప్రతినెల మూడవ శనివారం నాడు నిర్వహిస్తున్న కార్యక్రమంలో తాసిల్దార్ పై విధంగా స్పందించారు. మండల అధికారుల ఆధ్వర్యంలో శనివారం చల్లపేట ,మీసాల పేట గ్రామాలలో స్వచ్ఛ్ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో అధికారులు మమేకమై గ్రామంలోని వీధులు, చెరువులు, కాలువలు శుభ్రపరచి స్వచ్ఛ ఆంధ్ర నినాదంతో ముందుకు సాగారు. ఈ సందర్భంగా తాసిల్దార్ అరుణ్ కుమారి మాట్లాడుతూ స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమాల ద్వారా గ్రామాల్లో పరిశుభ్రతపై చైతన్య కలుగుతుందని ప్రతి ఒక్కరూ శుభ్రత విషయంలో నిర్లక్ష్యం వద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో విమల కుమారి, వెలుగు ఏపిఎం అన్నపూర్ణ, పంచాయితీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.