ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలైడ్ మరియు హెల్త్ కేర్ ప్రొఫిషన్స్ కౌన్సిల్, విజయవాడ సెక్రటరీ బి. సుమైలా ఉత్తరాంధ్ర జిల్లాలలో శనివారం ఉదయం పర్యటించి మెడికల్ కాలేజీ యాజమాన్యం వారికి డిప్లమా కోర్సులపై అవస్యకత, ప్రభుత్వం వారు అందించే ప్రోత్సాహం గూర్చి విరివిగా ప్రచారం చేయమని, డైరెక్ట్ అఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వారు అందించిన సహకారం మరియు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ లు, మరియు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ వారు అందిస్తున్న సహకారంనకు కాలేజీల యాజమాన్యం వారు గుర్తించి వారికి బద్దులై ఉండాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ అలైడ్ హెల్త్ కేర్ ప్రొఫిషనల్ మేనేజ్ మెంట్ అసోసియేషన్ తరుపున విజయనగరం జిల్లా సంఘం అధ్యక్షులు ఎం.ఎస్.ఎస్. సింహ గిరి పట్నాయక్ సెక్రటరీ బి. సుమైలా కు అభినందనలు తెలిపారు.
సెక్రటరీ శ్రీమతి బి.సుమైల ఉత్తరాంధ్ర జిల్లాలలో పర్యటనలో కాలేజీ యాజమాన్యంలకు కాలేజీల పరిశుభ్రత, విద్యార్థుల పై శ్రద్ద, సమయపాలన, విద్యార్థులను కాలేజీ యాజమాన్యం వారు వెట్టి చాకిరీ కు ఉపయోగించారాదని హెచ్చరిక జరీ చేసి, తగు సూచనలు చేసారు.
మంచి సూచనలు ఇచ్చి, ప్రోత్సాహం ఇచ్చిన సెక్రటరీ సుమైలా కు విజయనగరం జిల్లా తరుపున వీరాస్వామి, శృంగవరపుకోట నుంచి రాజు,రాజాం నుంచి ఆదిత్య విద్య సంస్థల యాజమాన్యం వారు మరియు విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల యాజమాన్యం వారు అభినందనలు తెలియజేసారు.