*”మట్టి వినాయక విగ్రహాల” పంపిణీ చేసిన ‘జనసేన నాయకులు అవనాపు విక్రమ్’*

ప్రముఖ సినీ నటులు మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా అంజనీపుత్ర చిరంజీవి సేవ సంఘం & అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఘననాధుని మట్టి ప్రతిమల పంపిణీ కార్యక్రమాన్ని జనసేన నాయకులు అవనాపు విక్రమ్ గారు గురువారం ప్రారంభించారు.

అంతకుముందు అక్కడికి చేరుకున్న జనసేన నాయకులు అవనాపు విక్రమ్ కు దుస్సాలువా కప్పి, మెమెంటో జ్ఞాపికను వాకర్స్ క్లబ్ పెద్దలు అందజేశారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరంజీవి పుట్టినరోజు నేపధ్యంలో మెగా అభిమానులు, వాకర్స్ క్లబ్ సభ్యులు మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేయడం అభినందనీయం అన్నారు. పర్యావరణ పరిరక్షణలో మెగా అభిమానులు భాగస్వాములు కావడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు (బాలు), లాలిశెట్టి రవితేజ, పత్తి గిల్లి వెంకట రావు, షేక్ మారేష్, ఖాదర్, శీర కుమార్, నేరుడబిల్లి చిన్నారావు మరియు మెగా అభిమానులు, జనసేన నాయకులు,జన సైనికులు, వాకర్స్ క్లబ్ పెద్దలు తాడ్డి ఆదినారాయణ, కోట్ల సత్యనారాయణ, కోట్ల ఈశ్వరరావు, బి. కృష్ణమూర్తి, శంకరరావు, పాల్గొన్నారు.

Exit mobile version