మెంటాడ: మెంటాడ మండలం పెద్దచామలాపల్లి పంచాయితీ పరిధిలో గురువారం జిల్లా పరిషత్ సీఈవో సత్యనారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెత్త సేకరణ ఎస్ డబ్ల్యూ సి వాడకం, ఐ వి ఆర్ ఎస్ విధానంపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. శుభ్రత పారిశుద్ధ్యన్ని కాపాడుకోవడంలో చెత్త సేకరణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. గ్రామస్థాయిలో వ్యర్ధాలను సక్రమంగా ఉపయోగించడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని ఆయన వివరించారు. సాలిడ్ వేస్ట్ కలెక్షన్ (ఎస్ డబ్ల్యూ సి) వినియోగం ఐ.వి.ఆర్.ఎస్ వ్యవస్థ ద్వారా ఫిర్యాదులు సూచనలు నమోదు చేయడంపై ప్రజలకు వివరణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో భానుమూర్తి, డిప్యూటీ ఎంపీడీవో విమల కుమారి, పంచాయతీ కార్యదర్శి తిరుపతి ఫీల్డ్ ఫీల్డ్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్. పారిశుద్ధ్య కార్మికులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.