పోలీసు సిబ్బంది ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద చూపాలి

*- విజయనగరం రూరల్ సిఐ బి.లక్ష్మణ్ రావ*

 

పోలీసు సిబ్బంది సంక్షేమంలో భాగంగా విజయనగరం రూరల్ సర్కిల్ పరిధిలో ఉన్న విజయనగరం రూరల్ మరియు గంట్యాడ పోలీస్ స్టేషన్ సిబ్బందికి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద చూపాలని సూచించారు. విజయనగరం రూరల్ సి ఐ బి.లక్ష్మణరావు గారు మ్యాక్సి విజన్ మల్టీ స్పెషాలిటి ఆసుపత్రి యాజమాన్యంతో సంప్రదించి రూరల్ మరియు గంట్యాడ పోలీస్ స్టేషన్ సిబ్బందికి ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించినట్టు ఆగష్టు 16న తెలిపారు. సిబ్బంది వృత్తిలో పడి వైద్య పరీక్షలు చేయించుకోక పోవడం వలన అనేక ఆరోగ్య సమస్యలను ముందుగా గుర్తించక ఇబ్బంది పడుతున్నారన్నారు. కావున, పోలీసు సిబ్బంది అందరు తరుచూ వైద్య పరీక్షలు చేయించు కోవాలన్నారు.
విజయనగరం రూరల్ మరియు గంట్యాడ పోలీస్ స్టేషన్ పరిధిలో పని చేస్తున్న సుమారు 40 మంది పోలీసు సిబ్బందికి మ్యాక్సి విజన్ మల్టీ స్పెషాలిటి ఆసుపత్రి యాజమాన్యం వారి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించినట్టు విజయనగరం రూరల్ సిఐ బి.లక్ష్మణ్ రావు తెలిపారు.

Exit mobile version