విజయనగరం జిల్లా చిరంజీవి యువత ఆధ్వర్యంలో “మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాలు” ప్రారంభం

🔸మొదటి రోజు మొక్కలు నాటే కార్యక్రమంతో ప్రారంభం
విజయనగరం జిల్లా చిరంజీవి యువత, అంజనీ పుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ మరియు అంజనీ పుత్ర చిరంజీవి బ్లడ్ డోనర్స్ క్లబ్ ఆధ్వర్యంలో పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాలు శుక్రవారం మొక్కలు నాటే కార్యక్రమంతో ప్రారంభం అయ్యాయి.
ఈ కార్యక్రమాన్ని జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు (బాలు) 42వ డివిజన్, కామాక్షినగర్, అయ్యన్న పేట జంక్షన్ వద్దనున్న మున్సిపల్ కార్పొరేషన్ నడక మైదానంలో నిర్వహించడం జరిగింది.
ఈసందర్భంగా ముఖ్య అతిధిలుగా హాజరైన ఎలక్ట్ గవర్నర్ ఎ. తిరుపతి రావు, క్లబ్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఎ. ఎస్. ప్రకాశరావు మాష్టారు మాట్లాడుతూ.. సేవేపరమార్ధంగా చిరంజీవి అభిమానులంతా రాష్ట్రంలోనే కాకుండా దేశవిదేశాల్లో వారోత్సవాల పేరుతో ప్రజలకు సేవచేస్తున్నారని,అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు రవణం స్వామి నాయుడు పిలుపుతో మెగాఫ్యామిలీ అభిమానులంతా సేవ అనేదృక్పధంతో ముందుకెళ్తడం అభినందనీయమని జిల్లా చిరంజీవి యువత చేసిన సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో జిల్లా చిరంజీవి యువత ప్రతినిధులు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, వాకర్స్ క్లబ్ ప్రతినిధులు భారీగా పాల్గొన్నారు.

Exit mobile version