వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

నెల్లిమర్లలోని డైట్‌ కాలనీలో నిర్వహిస్తున్న ఓ వ్యభిచార గృహంపై పోలీసులు సోమవారం దాడి చేశారు. ఈ దాడిలో వ్యభిచార గృహం నిర్వాహకురాలితో పాటు విటుడుని అరెస్ట్‌ చేసినట్లు ఎస్సై గణేశ్‌ తెలిపారు.
బాధితురాలికి కౌన్సిలింగ్‌ నిర్వహించి, బంధువులకు అప్పగించినట్లు చెప్పారు. ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే తమకు సమాచారం అందించాలని కోరారు.

Exit mobile version