ఇన్నోవేషన్‌కు ఘన ప్రోత్సాహం – విద్యార్థి ఆవిష్కరణకు రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్వి గారి చేతుల మీదుగా నగదు ప్రోత్సాహం

తక్కువ ఖర్చుతో సాధారణ సైకిల్‌ను ఎలక్ట్రిక్ సైకిల్‌గా మార్పు చేసిన ఇంటర్మీడియట్ విద్యార్థి సిద్దూ సృజనాత్మకతను గుర్తించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు స్వయంగా అభినందించారు. సోషల్ మీడియా ద్వారా ఈ ఆవిష్కరణను గమనించిన పవన్ కళ్యాణ్ గారు విద్యార్థిని ఇటీవల మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి పిలిపించి, ఆవిష్కరణ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆ యువ ప్రతిభను గుర్తించి ఒక లక్ష రూపాయల నగదును ప్రోత్సాహకంగా అందించారు.

ఈ నేపథ్యంలో, ఈ రోజు విజయనగరం నియోజకవర్గంలోని తన స్వగృహంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో, రాష్ట్ర తూర్పు కాపు సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు విజయనగరం అసెంబ్లీ ఇంచార్జ్ శ్రీమతి పాలవలస యశస్వి గారు ఆ విద్యార్థిని ప్రత్యేకంగా అభినందించి, ఆమె తరపున కొంత నగదును ప్రోత్సాహకంగా అందించారు.

విద్యార్థి రాజాం లోని జూనియర్ కాలేజీలో చదువుతూ, తన గ్రామమైన J కొత్తవలస గ్రామం నుండి రాజాం పట్నం లో SGCS కాలేజీకి రాకపోకలలో ఎదురవుతున్న సమస్యలతో తన స్వంత ఆలోచనతో ఈ ఆవిష్కరణ చేసినట్లు తెలిపాడు. ఈ కార్యక్రమంలో విద్యార్థి తన ఆవిష్కరణ యొక్క తీరుతెన్నులను వివరంగా వివరించాడు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ విజయనగరం జిల్లా, నియోజకవర్గం, టౌన్ మరియు మండల నాయకులు, విద్యార్థి తండ్రి, బంధువులు పాల్గొన్నారు.

శ్రీమతి యశస్వి గారు మాట్లాడుతూ, “ఇలాంటి ప్రతిభా వంతులైన యువత మన సమాజానికి మార్గదర్శకులు. వారి ఆలోచనలకు, ఆవిష్కరణలకు మనం గౌరవం ఇవ్వాలి, ప్రోత్సాహం అందించాలి. పవన్ కళ్యాణ్ గారి తరఫున అందిన సహాయం యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది,” అని అన్నారు.ఈ ఆవిష్కరణ కోసం పేటెంట్ హక్కు పొందెందుకు కోసం ఆమె వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియచేస్తూ ఆ విద్యార్ది చేత పేటెంట్ రైట్స్ ఫార్మ్ నింపించడం జరిగింది. తరువాత కొంత సమయం ఈ ఎలక్ట్రికల్ సైకిల్ ని పరిశీలించడం జరిగింది

Exit mobile version